తగ్గేదే లే.. హైదరాబాద్ వాసులకు TGSRTC గుడ్ న్యూస్..!

TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఇంటివద్దకే కార్గో సేవలు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముందుగా హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి ఈ హోం డెలివరీ సేవలు చేపట్టనున్నట్లు తెలిపారు.

tgsrtc
New Update

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలులోకి తెచ్చింది. అదే విధంగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. అయితే ఇది అందరికీ అందలేదు. దీంతోపాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కూడా అందిస్తోంది. అలాగే హామీలు మాత్రమే కాకుండా హైదరాబాద్‌లో మూసీనది సుందరీకరణ కోసం హైడ్రాను చేపట్టింది.

Also Read :  అన్న కోసం చాలా చేశా.. జగన్ నాకోసం ఏమీ చేయలేదు.. షర్మిల కంటతడి 

రాష్ట్రంలో హైవే రోడ్డు విస్తరణ కోసం ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కోట్లలో నిధులు మంజూరు చేసింది. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్డు విస్తరణ కోసం కొన్ని కోట్లు నిధులను విడుదల చేసింది. ఇలా ఒక్కొక్కటిగా చేస్తూ రేవంత్ సర్కార్ ముందుకు పోతుంది. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read :  అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్

త‌మ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్ (కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్తరిస్తోంద‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ అన్నారు. ఇందులో భాగంగానే హైద‌రాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అత్యంత వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. ఈ మేరకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read :  మా ఎమ్మెల్యేలకు ఎన్సీపీలో చేరాలని రూ. కోట్లు ఆఫర్ చేశారు: కాంగ్రెస్

రేపటి నుంచి (ఆదివారం) ఈ హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హైద‌రాబాద్‌లోని దాదాపు 31 ప్రాంతాల నుంచి ప్రారంభం కానున్నాయని అన్నారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్‌లో ఎక్కడికైనా హోం డెలివ‌రీ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని చెప్పుకొచ్చారు. ప్రజ‌లంద‌రూ ఈ హోం డెలివ‌రీ సేవలను ఉప‌యోగించుకోవాల‌ని మంత్రి పొన్నం ప్రభాక‌ర్ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సేవలు విస్తరించనున్నట్లు మంత్రి చెప్పారు.

Also Read: Canada వెళ్లి చదువుకోవాలనుకునేవారు జాగ్రత్త.. భారత దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు

పార్శిళ్ల హోం డెలివ‌రీ చార్జీలు!

0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50
1.01నుంచి 5 కేజీల‌కు రూ.60
5.01 నుంచి 10 కేజీల‌కు రూ.65
10.1 నుంచి 20 కేజీల‌కు రూ.70
20.1 నుంచి 30 కేజీల‌కు రూ.75
30.1 కేజీలు దాటితే మరికాస్త అధిక ధ‌ర‌లు ఉంటాయి. అయితే ఈ హోం డెలివరీ సర్వీస్ వద్దనుకునే వారు బస్టాండ్‌కి వెళ్లి పార్శిళ్లు తీసుకోవచ్చు. 

#tgsrtc-bus
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe