Group 3 ఎగ్జామ్ వేళ.. మనస్సు దోచే పరిణామాలు తెలంగాణలో ఈరోజు, రేపు గ్రూప్-3 పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో 1,401 కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. By Seetha Ram 17 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/9 గ్రూప్3 పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ డి.జానకి సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు. 2/9 మహబూబ్ నగర్ జిల్లాలో గ్రూప్-3 పరీక్షల సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులకు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఎస్పీ జానకి భద్రతపరమైన సూచనలు ఇచ్చారు. 3/9 TGPSC గ్రూప్ -3 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్న ABV collegeని జనగాం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. 4/9 అనంతరం జిల్లాలో ప్రశాంతత వాతావరణంలో గ్రూప్ 3 పరీక్షలు జరుగుతున్నట్టు తెలిపారు. 5/9 ఖమ్మం జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో గ్రూప్-3 పరీక్షలు ప్రారంభం అయ్యాయి. దానికంటే ముందు అభ్యర్థులను తనిఖీ చేశారు. 6/9 శంకర్ అనే యువకుడు అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాడు. తన భార్య స్వప్న గ్రూపు పరీక్ష రాయడానికి కరీంనగర్‌లోని స్థానిక సిద్ధార్థ పాఠశాలలో సెంటర్ పడగా.. దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చొని తమ పది నెలల అబ్బాయిని జోకొట్టి నిద్ర పుచ్చి కనిపించాడు. 7/9 గ్రూప్ 3 పరీక్షకి ఆలస్యం అయిపోతుంది అని టెన్షన్ పడుతున్న ఒక మహిళను పోలీసు వాహనంలో పరీక్ష హాలుకి చేర్చిన జీడిమెట్ల CI. 8/9 గ్రూప్-III పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 9/9 ఇవాళ జగిత్యాల పట్టణంలోని NSV డిగ్రీ కళాశాల, ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల, నలంద కాలేజీలో జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షకేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ తనిఖీ చేశారు. #tgpsc group 3 #group 3 exams మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి