TGPSC Group-1: గ్రూప్-1 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!

ఈ నెల ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

TGPSC Group-1 Hall tickets
New Update

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు https://hallticket.tspsc.gov.in/h022024d08f5d90-6aaa-4360-acb2-046f588e3284 లింక్ పై క్లిక్ చేసి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసింది. మొత్తం 563 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. జూన్ 9న ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరు కాగా.. 31,382 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు.

ఇది కూడా చదవండి: TS:  తెలంగాణ ఆరోగ్యశాఖలో జాబ్స్...371 నర్సింగ్ పోస్టులు

వీరందిరికీ ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహించనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మెయిన్స్ పరీక్షకు మొత్తం 6 పేపర్లు ఉండనున్నాయి. ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనుంది టీజీపీఎస్సీ. ఇంగ్లిష్, తెలుగు, ఉర్తు భాషల్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. కేవలం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రమే ఈ పరీక్ష ను నిర్వహించనున్నారు. 

ఇది కూడా చదవండి: గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల!

రేపు కోర్టు కీలక తీర్పు..

మరో వైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రశ్నాపత్రాల్లో తప్పులు ఉన్నాయని వారు వారు పేర్కొన్నారు. కొందరైతే పాత నోటిఫికేషన్ రద్దు చెల్లదని కూడా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. వాస్తవానికి ఈ రోజు తీర్పు వెల్లడించాల్సి ఉన్నా.. రేపటికి వాయిదా వేసింది. మరికొన్ని రోజుల్లోనే మెయిన్స్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందనే అంశంపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 

ఇది కూడా చదవండి: 41,500 రైల్వే ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ షెడ్యూల్ వెల్లడి

ఇప్పటికే రెండు సార్లు రద్దు..

గతంలో పేపర్ లీక్ కారణంగా ఒకసారి.. పరీక్ష నిర్వహణలో నిబంధనలు పాటించని కారణంగా మరోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఏకంగా పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి.. అదనంగా మరో 60 పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 

ఇది కూడా చదవండి: కోచింగ్ సెంటర్లపై ఫిర్యాదు చేయాలంటే.. డయల్ చేయాల్సిన నంబర్ ఇదే!

#tgpsc #tgpsc-group-1 #telangana-government-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe