తిరుపతి కల్తీ లడ్డూ ఎఫెక్ట్.. తెలంగాణ ఆలయాల్లో తనిఖీలు.. ఇక నుంచి..

తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ ఎఫెక్ట్ తెలంగాణపై ప్రభావం చూపింది. అన్ని ఆలయాల్లో తనిఖీలు చేపట్టాలని దేవాదాయశాఖ ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల ప్రసాదాలకు విజయ పాలు, నెయ్యి మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  

drdrrdrer
New Update

Laddu : తిరుపతి లడ్డూ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఏపీలో అన్ని ఆలయాల్లో తనిఖీలు చేపడుతుండగా తాజాగా తెలంగాణ దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ఆలయాల్లో తనిఖీలు చేపట్టాలని ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో లడ్డూ, పులిహోర తయారీలో వాడే నెయ్యి, డ్రై ఫ్రూట్స్, చక్కెర, బూందీ, యాలకులు వంటి ప్రసాదాలకు వాడే సరుకుల నాణ్యతను పరిశీలించాలని సూచించింది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా విజయ పాలు, నెయ్యి మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. 

ప్రసాదాల తయారీకోసం ప్రత్యేక కమిటీ..

ఈ క్రమంలో వెంటనే తనిఖీలు చేపట్టిన అధికారులు.. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హనుమకొండ భద్రకాళి ఆలయాల్లో వాడే నెయ్యి శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్ కు పంపించారు. టెస్టులకు సంబంధించిన వివరాలు నాలుగు రోజుల్లో రాబోతున్నట్లు ఆలయ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు తెలిపారు. అయితే కొన్నేండ్లుగా మదర్ డెయిరీ వాడుతున్న విషయం తెలిసిందే. కాగా నెలకు 20 నుంచి 25 వేల కిలోల నెయ్యి ప్రసాదాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా  భద్రాచలం ఆలయంలో రోజూ 3 వేల నుంచి 4 వేల లడ్డూలు తయారు చేస్తున్నామని, ప్రసాదాల తయారీకోసం ప్రత్యేక కమిటీ నియమించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. భద్రాచలంతోపాటు వేములవాడ నెయ్యిని 20 రోజుల క్రితమే ల్యాబ్ కు పంపించినట్లు స్పష్టం చేశారు. హనుమకొండలోని భద్రకాళి టెంపుల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టి, శాంపిల్స్ ల్యాబ్ ​కు పంపించారు. బాసర సరస్వతి ఆలయంలో కరీంనగర్ డెయిరీ నెయ్యి వాడుతున్నాం. దేవాదాయ శాఖ ఆదేశాలతో గతవారం నుంచి విజయ డెయిరీ నెయ్యి వినియోగిస్తున్నామని ఈవో విజయరామారావు తెలిపారు. 

అందరికీ విజయ డెయిరీ సరఫరా..

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 5 దేవాలయాలు ‘విజయ’ నెయ్యి కొనేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బాసర 1500 కిలోలు, వేములవాడ దేవస్థానం పదివేల కిలోలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం 980 కిలోలు, మంచిర్యాల వేంకటేశ్వరస్వామి దేవాలయం 105 కిలోగ్రాములు, వరంగల్‌ భద్రకాళి దేవాలయం 1,050 కిలోల  నెయ్యి ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడించారు. మరిన్ని ఆలయాల నుంచి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందని, అందరికీ నెయ్యి సరఫరా చేసేందుకు విజయ డెయిరీ సిద్ధంగా ఉందని పశుసంవర్ధకశాఖ ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ తెలిపారు.
 

ప్రైవేటు సంస్థల నుంచి తీసుకుంటే చర్యలు

ఇక ముంబై సంస్థలు నెయ్యి కొనడం మానెయ్యడంతో 50 టన్నులకు పైగా మిగిలిపోయిందని విజయ డెయిరీ ఎండీ లక్ష్మి దేవాలయాల శాఖకు లేఖలు రాశారు. అయితే స్పందన రాకపోవడంతో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌ను కలిసి పరిస్థితి గురించి తెలిపారు. వెంటనే దీనిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో విజయ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

Also Read :  దుబ్బాకలో రచ్చ రచ్చ.. బీజేపీ Vs బీఆర్ఎస్ Vs కాంగ్రెస్!

#vijaya-dairy #Tirupati Laddu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe