/rtv/media/media_files/2025/03/29/yIKApWmMt1fjfRm9HmDa.jpg)
Telangana Signs MoU with Himachal Pradesh for Hydro Projects
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌తో విద్యుత్ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనిపై కీలక ప్రకటన చేశారు. ‘తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2025’ ప్రకారం పర్యావరణ పరిరక్షణ కోసం ఈ విద్యుత్ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. విద్యుత్ భద్రతను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
Also Read: మరో మయన్మార్ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం!
శనివారం హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '' థర్మల్ పవర్‌తో పోల్చి చూసినప్పుడు హైడల్ పవర్ ఉత్పత్తి (జల విద్యుత్) ఖర్చు తక్కువగా ఉంది. థర్మల్ పవర్ ఉత్పత్తి ఖర్చు ఏటా పెరుగుతూ ఉండగా.. హైడల్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు మాత్రం క్రమంగా తగ్గుతోంది.
Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన సీఐడీ
హిమాచల్‌ప్రదేశ్ ఎక్కువగా జీవ నదులు ఉన్న రాష్ట్రం. ఇక్కడ ఏడాదిలో 9 నుంచి 10 నెలల పాటు నిరంతర హైడల్ పవర్ (జల విద్యుత్) ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు చేసుకున్న ఈ ఒప్పందం వల్ల తెలంగాణకు తక్కువ ధరకే, పర్యావరణ హితమైన విద్యుత్ అందించే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాజెక్టులను తెలంగాణ జెన్‌కో నామినేషన్ చేపడుతోందని'' భట్టి విక్రమార్క అన్నారు.
Also Read: కోలకత్తా జూ.డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు..సీబీఐ
Also Read: పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 8 మంది పాక్ ఆర్మీ సైనికులు మృతి
telugu-news | telangana