Arekapudi : అరికెపూడి ఇంటి వద్ద హైటెన్షన్.. కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్!

అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ ఇప్పుడు తారా స్థాయికి చేరింది. ఈ రోజు అరికెపూడి ఇంటికి వెళ్తానంటూ కౌశిక్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరికెపూడి నివాసం వద్దకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

author-image
By Manoj Varma
New Update

Arekapudi Gandhi :

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం అరికెపూడి ఇంటికి వచ్చారు. ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అరికెపూడి మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి 2018లో వచ్చాడన్నారు. తనను కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లే స్థాయి ఆయనది కాదన్నారు. పదేళ్ల నుంచి తాను పార్టీలో ఉంటున్నానన్నారు. అవసరమైతే తానే కేసీఆర్‌ను డైరెక్ట్‌గా కలుస్తానన్నారు. ప్రాంతీయ విభేదాల గురించి కౌశిక్‌రెడ్డి మాట్లాడడంపై కేసీఆర్‌ ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. వివాదం తనకు, కౌశిక్‌రెడ్డి మధ్యే కానీ పార్టీతో కాదని స్పష్టం చేశారు.

నిన్న కౌశిక్ రెడ్డి నివాసానికి అరికెపూడి వెళ్లేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, టమాటాలు విసరడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి తరలించారు. అయితే.. కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన హరీశ్ రావు అరికెపూడి గాంధీని అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వెళ్లి ఆందోళన కొనసాగించారు. అయితే.. ఎంతకూ ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కందుర్గ్ పీఎస్ కు తరలించి అర్థరాత్రి విడుదల చేశారు. ఈ రోజు సైతం హరీశ్ రావును హౌజ్ అరెస్ట్ చేశారు.

#Arekapudi Gandhi #koushik-reddy #telangana-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe