గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అవ్వండి.. ఆ పోస్టులను లైక్ చేసినా వేటే.. సిబ్బందికి పోలీసు శాఖ సంచలన ఆదేశాలు

టీజీఎస్పీకి వ్యతిరేకంగా ఉండే వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ కావాలని సిబ్బందికి తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో TGSPకి వ్యతిరేకమైన పోస్టులను షేర్ చేసినా లైక్ చేసినా చర్యలు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు.

author-image
By Nikhil
Telangana DGP
New Update

తెలంగాణ స్పెషల్ పోలీస్ (TGPT) సిబ్బంది ఆందోళనల నేపథ్యంలో సెక్రటేరియట్ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన సచివాలయంలో విధులు నిర్వర్తించే వారిపైన నిఘా ఉంటుందన్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించే వారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ పోస్టులు పెడుతున్నారు? తదితర అంశాలపై అత్యంత నిఘా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో అనవసరం జోక్యం చేసుకోద్దని సూచించారు. ఏ ఒక్కరు తప్పు చేసినా.. ఎఫెక్ట్ అందరి మీద ఉంటుందని హెచ్చరించారు. ఈ రోజు నుంచి సచివాలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. కావున ఐదు గురు కంటే ఎక్కవుగా గుమిగూడి ఉన్నా, ధర్నాలు, రాస్తారోకోలు, సచివాలయ ముట్టడి లాంటి వాటిలో పాల్గొంటే, వారిమీద చట్ట పరమయిన చర్యలు ఉంటాయన్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, తోటి సిబ్బందికి తెలపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: గ్రూప్ 1 మెయిన్స్ ఎంపికైన వారిలో కేటగిరీ జాబితా విడుదల

ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వొద్దు..

మీరు చాలా వాట్సాప్ గ్రూప్స్ లలో అడ్మిన్ గా ఉంటూ, మిగతా సిబ్బందిని గ్రూప్ లో యాడ్ చేస్తూ TGSP వ్యవస్థ గురించి మరియు పోలీస్ ఆఫీసర్స్ గురించి రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి మీద నిఘా ఉంటుందని.. అందరూ తక్షణమే అలాంటి గ్రూప్స్ నుండి ఎగ్జిట్ అవ్వాలని హెచ్చరించారు. సిబ్బంది, సిబ్బంది కుటుంబ సభ్యులు ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు లాంటి అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొనొద్దని స్పష్టం చేశారు. అలా చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: High Court: ఫామ్ హౌజ్ కేసు.. రాజ్ పాకాలకు బిగ్ రిలీఫ్!

లైక్ కొట్టినా చర్యలే..

TELEGRAM, FACEBOOK, INSTAGRAM, TWITTER ,WHATSAPP లలో TGSPవ్యవస్థ గురించి, పోలీస్ ఆఫీసర్స్ గురించి మరియు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా పోస్ట్లు పెట్టడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, లైక్ చేయడం లాంటివి చేయవద్దన్నారు. ప్రతీ కదలికల మీద నిఘా ఉంటుందని.. పొరపాటున దొరికితే తక్షణమే శాఖపరమయిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

 

#telangana-police
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe