High Court: ఫామ్ హౌజ్ కేసు.. రాజ్ పాకాలకు బిగ్ రిలీఫ్!

హైకోర్టులో కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు ఊరట లభించింది. రాజ్‌ పాకాలను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల ముందు హాజరు కావాని రెండు రోజుల సమయం ఇవ్వాలని సూచించింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు తెలిపింది.

author-image
By Nikhil
New Update

హైకోర్టులో కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు ఊరట లభించింది. రాజ్‌ పాకాలను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల ముందు హాజరు కావాని రెండు రోజుల సమయం ఇవ్వాలని సూచించింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు తెలిపింది. హైకోర్టులో కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాలకు ఊరట లభించింది. రాజ్‌ పాకాలను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల ముందు హాజరు కావాని రెండు రోజుల సమయం ఇవ్వాలని సూచించింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు తెలిపింది. పోలీసులు తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు.

Also Read :  కిరణ్ అబ్బవరం అంటే తమిళ స్టార్స్ భయపడుతున్నారా?

కేటీఆర్ బావమరిది కాబట్టే..

రాజ్ పాకాల తన ఇంట్లో పార్టీ చేసుకుంటే అక్రమంగా పోలీసులు వచ్చి దాడి చేశారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వేరే వ్యక్తికి డ్రగ్ పాజిటివ్ వస్తే  రాజ్ పాకాల ను నిందితుడిగా చేర్చారన్నారు. డ్రగ్ టెస్ట్ కు శాంపుల్ ఇవ్వాలని మహిళలను ఇబ్బంది పెట్టారన్నారు. ప్రతిపక్ష నేత కేటీఆర్ బావమరిదిని కాబట్టే టార్గెట్ చేశారన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసులు పెట్టారని వాదనలు వినిపించారు.

Also Read :  డిజిటల్ అరెస్టుల్లో రూ.120 కోట్లు పోగొట్టుకున్న బాధితులు..

నిబంధనల ప్రకారమే నోటీసులు: ప్రభుత్వ న్యాయవాది

అయితే.. తాము అరెస్ట్ చేస్తామని ఎక్కడా చెప్పలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. అక్రమంగా మద్యం బాటిళ్లు లభించడంతో పాటు ఒక వ్యక్తికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని కోర్టుకు తెలిపారు. ఇందులో రాజకీయ మోటివ్ లేదని స్పష్టం చేశారు. రాజ్ పాకాలకు నిబంధనల ప్రకారమే 41A కింద నోటీసులు ఇచ్చామని తెలిపారు. 

Also Read :  ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగితే ఇక అంతే

Also Read :  డబుల్ షాక్.. క్వాలిటీ టెస్ట్‌లో ఆ ట్యాబ్లెట్స్ ఫెయిల్..మొత్తం ఎన్నంటే?

Advertisment
తాజా కథనాలు