తెలంగాణలో గత కొన్ని రోజులుగా లేడీ అఘోరీ తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ లో కొండగట్టు, వేములవాడ రాజన్న, కీసర ఆలయాలను ఆమె సందర్శించారు. ఒంటిపై దుస్తులు లేకుండా.. విభూది రాసుకుని సంచరిస్తున్న ఆ అఘోరిని చూసి అంతా షాక్ అయ్యారు. ఇటీవల సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆమె మళ్లీ అక్కడ ప్రత్యక్ష్యమయ్యారు. అక్కడ ఒంటికాలిపై నిలబడి పూజలు చేశారు. అప్పటి నుంచి మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యారు.
ఇది కూడా చదవండి: మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?
వరుసగా ఇంటర్వ్యూలు..
అనంతరం మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. తాను శవాలను తింటానని, ఆత్మలతో మాట్లాడతానని చెబుతున్నారు. అయితే.. అనేక మంది ఆమె తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కీసర పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగానే ఆమె అఘోరాగా మారారా? లేక జనాలను మోసం చేస్తోందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే.. పోలీసులు మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇది కూడా చదవండి: యాదాద్రి ఆలయంలో కౌశిక్‌రెడ్డి ఫొటోషూట్.. మండిపడుతున్న భక్తులు
ట్రాన్స్ జెండర్..
అయితే ఆమె అఘోరీ కాదు ట్రాన్స్ జెండర్ అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆమె అబద్ధాలు చెబుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ అఘోరీ తాను కాలుతున్న శవాల నుంచి మాసం తీసుకుని తింటానని చెప్పడంతో దుమారం మొదలైంది. ఇది నేరమని అనేక మంది పోస్టులు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ అఘోరీని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెతే ఆమె నిజంగానే అఘోరీనా? లేక జనాలను మోసం చేయడానికి ఇలా చెబుతుందా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: T-Sat : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాలకు ఫ్రీగా కోచింగ్!