నల్లగొండ జిల్లా (Nalgonda District) కొండభీమనపల్లిలో గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. కొండభీమనపల్లిలో ఉన్న మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. మంగళవారం రోజున స్కూల్ లో ఉదయం పూట టిఫిన్ తినేసిన తర్వాత ఎవరికీ కనిపించలేదు. స్కూల్ లో ఉన్న టీచర్లు, ప్రిన్సిపల్ ఎంత వెతికిన వారి ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరాలను చూడగా ముగ్గురు విద్యార్థులు గోడ దూకి వెళ్లినట్లు తెలిసింది.
Also Read : బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్
అందుకే పారిపోయారా?
పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అబ్దుల్ రహమాన్, ముజీబ్, తౌఫిక్‌లు పారిపోయినట్లు పాఠశాలు ఉపాధ్యాయులు తెలిపారు. స్కూల్ నుంచి పిల్లలు పారిపోయారని వాళ్ల కుటుంబ సభ్యులకు పాఠశాల సిబ్బంది తెలియజేశారు. రెండు రోజులైన కూడా పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో వారు దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు విద్యార్థులను ఉపాధ్యాయులు లేదా తోటి విద్యార్థులు ఎవరైనా అన్న కోణంలో పోలీసులు స్కూల్ సిబ్బంది వద్ద వివరాలు సేకరించారు. అయితే ఆ ముగ్గురు విద్యార్ధులు సోమవారం రోజు ప్రహరీ గోడ నుంచి ఒక ప్యాకెట్ తీసుకున్నట్లు తెలిసింది.
Also Read : హెలికాఫ్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం.. పొలంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
దానిని చెక్ చేయగా అందులో కల్లు ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. కల్లు ప్యాకెట్ కావడంతో విద్యార్థులను టీచర్లు మందలించినట్లు సమాచారం. అయితే ఆ ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు ఎలాంటి తప్పు చేయలేదని, ఆ ప్యాకెట్లకు మాకు ఎలాంటి సంబంధం లేదని లేఖ రాశారు. తాము స్కూల్ నుంచి వెళ్లిపోతున్నామని.. తమని వెతకవద్దని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ హాస్టల్‌కి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసులు కూడా ముగ్గురు విద్యార్థుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతుకుతున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రలు ఆందోళనకు గురవుతున్నారు. ప్యాకెట్ల విషయమై మందలించడం వల్లే విద్యార్థులు పారిపోయారా? లేకపోతే ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read : సంక్రాంతికి 400 ప్రత్యేక రైళ్లు!