/rtv/media/media_files/2025/10/08/ponnam-vs-adluri-laxman-2025-10-08-11-56-39.jpg)
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అడ్లూరి లక్ష్మణ్ తనకు సోదరుడి లాంటి వారన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమకు 30 సంవత్సరాలుగా స్నేహబంధం ఉందన్నారు. ఇది రాజకీయాలకు మించినదన్నారు. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగిందని.. ఇది ఎవరూ విడదీయరానిదని అన్నారు. అడ్లూరిపై తాను ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించారని వ్యాఖ్యానించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు నాకు సోదరులవంటివారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగింది. ఎవరు విడదీయరానిది.
— Ponnam Prabhakar (@Ponnam_INC) October 8, 2025
నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు. అట్టడుగు…
వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏర్పడిన అపార్థాల కారణంగా తనకు అన్నలాంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనస్సు నొచ్చుకుందన్నారు. ఈ విషయం తెలిసి తాను తీవ్రంగా విచారిస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై తాము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. పొన్నం ప్రకటన తర్వాత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శాంతించలేదు. పొరపాటున మాట్లాడాను అనాల్సింది పోయి విచారం వ్యక్తం చేస్తున్నాననడం సరికాదన్నారు. దీన్ని పొన్నం విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
నేను బాధపడితే చింతించాల్సిన అవసరం లేదు
— Sarita Avula (@SaritaAvula) October 8, 2025
ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా చూసింది
మంత్రి పొన్నం పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ pic.twitter.com/DOsavYk1hO
ఇదిలా ఉంటే.. మంత్రుల వివాదం తారా స్థాయికి చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. దీంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేరుగా రంగంలోకి దిగారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తో పాటు పలువురు నేతలతో తన నివాసంలో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనూ పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశం సందర్భంగా తీసిన ఫొటోలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. అడ్లూరి లక్ష్మణ్ చాలా సీరియస్ గా ఉన్నట్లు ఆ ఫొటోలను పరిశీలిస్తే అర్థం అవుతోంది.