మంత్రి పొంగులేటి వేధింపులు తట్టుకోలేను.. పురుగుల మందు తాగిన BRS కార్యకర్త!

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో కలకలం చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేధింపులు తట్టుకోలేనంటూ బీఆర్ఎస్ నేత బానోత్ రవి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది.

New Update
Minister Ponguleti

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో కలకలం చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేధింపులు తట్టుకోలేనంటూ బీఆర్ఎస్ నేత బానోత్ రవి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఖమ్మం పోలీస్ కమిసనర్ ఆఫీస్ ఎదుట రవి పురుగుల మందు తాగిన రవి.. స్థానిక RTV ప్రతినిధికి ఫోన్ చేసి విషయం తెలిపాడు. దీంతో స్పందించిన ఆర్టీవీ ప్రతినిధి అతనిని ఆస్పత్రికి తరలించాడు. గతంలో ఆర్మీలో జవాన్‌గా పని చేసిన రవి ఉద్యోగాన్ని వదిలి పాలిటిక్స్ లో చేరారు. స్థానికంగా రాజకీయ కక్షసాధింపులు పెరిగిపోయాయని.. ఇక తట్టుకోలేక ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించనని అతను చెబుతున్నారు. ఈ ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నేతలు ఇంత వరకు స్పందించలేదు. 

నన్ను చంపేందుకు కుట్ర..

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రవి ఓ వీడియో విడుదల చేశారు. తాను ఆత్మహత్య చేసుకునే అంత పిరిగివాడిని కాదని ఆ వీడియోలో పేర్కొన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అతని బంధువు తుంబూరు దయాకర్ రెడ్డి, రామసహాయం నరేష్ రెడ్డి పెట్టే ఇబ్బందులు తట్టుకోలేకనే తాను ఈ చర్యకు పాల్పడుతున్నానన్నారు. అధికారాన్ని, పోలీసు శాఖను అడ్డం పెట్టుకుని తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం తనను కొనేందుకు తుంబూరు దయాకర్ రెడ్డి ప్రయత్నించాడని ఆరోపించారు. ఈ నెలలోనే తనను చంపేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారన్నారు. అది కూడా సాధ్యం కాకపోవడంతో తనపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisment
తాజా కథనాలు