Ponnam Vs Adluri: మాదిగోడిననే నాపై చిన్నచూపు.. ఆరోజు అసలేం జరిగిందంటే.. పొన్నంపై అడ్లూరి షాకింగ్ కామెంట్స్!

మాదిగోడు నాతో సమానంగా కూర్చుంటడా అన్న డబ్బున్న మదంతోనే పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు. ఆగస్టు 15న కరీంనగర్ లో మంత్రిగా తాను జెండా ఎగురవేసిన నాటి నుంచి పొన్నం ఓర్వలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
Ponnam Prabhakar Vs Adluri laxman

మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే తనపై పొన్నం ప్రభాకర్ చిన్నచూపు చూస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగోడు నాతో సమానంగా కూర్చుంటడా అన్న డబ్బున్న మదంతోనే తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు. ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్లో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆ ప్రెస్ మీట్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ తో పాటు అడ్లూరి లక్ష్మణ్‌ పాల్గొనాల్సి ఉంది. అయితే ముందుగా పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి వచ్చారు. అడ్లూరి కోసం వెయిట్ చేస్తున్న సమయంలో పొన్నం ప్రభాకర్ మరో మంత్రి వివేక్ చెవిలో మనకు టైం అంటే తెలుసు.. జీవితం అంటే తెలుసు.. వాడికేం తెలుసు దున్నపోతు.. అంటూ అన్నారు.

మంత్రి అడ్లూరిని ఉద్ధేశించే పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మాదిగ మంత్రిని పొన్నం ప్రభాకర్ అవమానించారన్న చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ స్పందించారు. ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. సహచర మంత్రిని అవమానించినా చూస్తూ ఉంటావా వివేక్ అని ప్రశ్నించారు.

పొన్నం వ్యాఖ్యలపై మాదిగ ఎమ్మెల్యేలు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి అన్నీ తెలుసని అనుకుంటున్నానన్నారు. పొన్నంకు 24 గంటలు డైడ్‌లైన్ విధిస్తున్నానన్నారు. ఈ లోగ వివరణ ఇవ్వకపోతే హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సామాన్య కార్యకర్త మాతో సమానంగా కూర్చుంటడా.. వీడేంది అన్న భావన పొన్నంకు ఉందన్నారు. కేవలం తాను ఒక్కడినే ఉండాలన్నది పొన్నం కుట్ర అని అన్నారు. 

నిన్న పొన్నం వివరణ:

ఈ వివాదంపై నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు. సహచర మంత్రి అడ్లూరిపై తాను అనని మాటల్ని అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అడ్లూరి లక్ష్మణ్ అంటే తమకెంతో గౌరవమని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లేందుకు టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాకపోవడంతో తన సిబ్బందిని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. కానీ కొందరు వాటిని వక్రీకరించి అడ్లూరి లక్ష్మణ్ ను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు