BIG BREAKING: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈసీ కీలక ప్రకటన!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఈ రోజు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక ప్రకటన చేశారు.

New Update
Election Commission

Election Commission

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఈ రోజు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై అభ్యంతరాలను ఈ నెల 26వ తేదీ లోగా సమర్పించాలని సూచించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయయారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో భాగంగా పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ పై ఈ ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఉన్న 329పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించామని తెలిపారు. గతంలో 132 లొకేషన్లలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 139 లొకేషన్లలో ప్రతిపాదించామని వివరించారు. అదనంగా 79 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ రేషనలైజేషన్ నివేదికను ఈ నెల 28వ తేదీ లోగా ఎన్నికల కమిషన్‌కు పంపించాల్సి ఉందన్నారు. అభ్యంతరాలను 26వ తేదీ లోగా తప్పనిసరిగా సమర్పించాలని కమిషనర్ సూచించారు.

బూత్ లెవెల్ ఏజెంట్లు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 329 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులు (BLO) అందుబాటులో ఉన్నారని కమిషనర్ తెలిపారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే బూత్ లెవెల్ ఏజెంట్‌ల జాబితా సమర్పించాయన్నారు. ఇంకా ఇవ్వని పార్టీలు వెంటనే జాబితా అందజేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన 79 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులను త్వరలోనే నియమిస్తామని ఆయన వెల్లడించారు.

జనవరి 6 నుండి ఆగస్టు 15 వరకు మొత్తం 19,237 ఓటర్ల నమోదు దరఖాస్తులు అందిన్లు కర్ణన్ తెలిపారు. అందులో 3,767 తిరస్కరించబడ్డాయన్నారు. ఇందులో ఇంకా 16 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఫారం-6 ద్వారా వచ్చిన 5,426 దరఖాస్తుల్లో 1,478 తిరస్కరించినట్లు చెప్పారు. ఫారం-7 ద్వారా వచ్చిన 3,453 దరఖాస్తుల్లో 1,010 తిరస్కరించబడ్డాయన్నారు. 12 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఫారం 8 ద్వారా వచ్చిన 10,358 అప్లికేషన్లలో 1,279 రిజెక్ట్ అయ్యాయన్నారు. ఈ సమావేశంలో ఎల్‌బి నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎన్నికల అదనపు కమిషనర్ మంగతాయారు, జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ ఈవోఆర్ రజనీకాంత్ రెడ్డి వివిధ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. 

Advertisment
తాజా కథనాలు