TS Inter Board: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. డేట్స్ ఇవే!

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది.

author-image
By Archana
New Update
Inter Board

Inter Board

TS Inter Board:  తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమై.. మార్చి 18వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది.  ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు  తెలిపింది. ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.  గతంలో మార్చిలో మొదలయ్యే పరీక్షలను, ఈ సంవత్సరం విద్యార్థులు JEE మెయిన్, EAPCET (EAMCET), నీట్ (NEET) వంటి పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి వీలుగా, ఫిబ్రవరి 25 నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించారు. దీనివల్ల విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం ఎక్కువ సమయం లభిస్తుందని తెలిపారు.  అలాగే ఈ ఏడాది ఎగ్జామ్ సిలబస్, ప్రాక్టికల్స్ లో జరగబోయే మార్పుల గురించి కూడా వివరించారు. 

సిలబస్ లో మార్పులు 

సాధారణంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉంటాయి. కానీ ఈ ఏడాది.. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపారు. అలాగే 12 ఏళ్ళ తర్వాత ఇంటర్ సిలబస్ మార్పులు జరుగబోతున్నట్లు వెల్లయించారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ కి సంబంధించిన సిలబస్ మారబోతున్నట్లు తెలిపారు. జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష,   జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24న  ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత 25 నుంచి రాత పరీక్షలు ప్రారంభమవుతాయి. 

పరీక్షల తేదీలు  

    • ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ రాత  పరీక్షల ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 25 నుంచి 

    • సెకండ్‌ ఇయర్‌ రాత  పరీక్షల ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 26 నుంచి

ప్రాక్టికల్ పరీక్షలు

  • ప్రాక్టికల్స్  థియరీ పరీక్షలకు ముందుగా జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి మొదటి వారంలో ముగియనున్నాయి. 

ఫీజు చెల్లింపు

నవంబర్​ 1 నుంచి నుంచి నవంబర్ 11 వరకు ఆన్ లైన్ ద్వారా విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు. 

Also Read: High Paying Jobs: ఫ్రెషర్లకు బెస్ట్ ఆప్షన్స్.. ఈ 5 ఉద్యోగాలకు లక్షల్లో జీతం.. అనుభవం అవసరమే లేదు!

Advertisment
తాజా కథనాలు