2024 సంవత్సరం మరో రెండు రోజుల్లో ముగియనుంది. దీంతో ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కోసం యువత తహతహలాడుతోంది. డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికోసం అంతా సిద్దమవుతున్నారు. ఆ రోజు ఎలా ఎంజాయ్ చేయాలా? అని ఇప్పటి నుంచే ప్లాన్‌లు వేసుకుంటున్నారు.
ALSO READ: బాక్సింగ్ డే టెస్ట్.. థర్డ్ అంపైర్ కాల్‌పై కమిన్స్ అసహనం!
మద్యం ఏరులైపారేలా
చుక్కా.. ముక్కా పక్కాగా ఉండాలని స్నేహితులంతా కలిసి చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మద్యం ప్రియులు ఆ రోజున పీకలదాకా తాగి ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మద్యం ఏరులైపారేలా కనిపిస్తోంది. మందు బాబులకు మద్యం ఎక్కడా తక్కువ కాకుండా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా 'నో స్టాక్ బోర్డ్' లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
ALSO READ: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్.. అదనంగా రూ.4000!
రూ.1000 కోట్ల లిక్కర్ సేల్
డిసెంబర్ 31న దాదాపు రూ.1000 కోట్ల లిక్కర్ సేల్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని కోసమే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల కోసం ముందుగానే మద్యం స్టాక్ డిపోల నుంచి వైన్సులు, బార్లకు భారీగా లిక్కర్ లిఫ్టింగ్ (పంపిణీ) చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్ షాప్స్ ఉన్నాయి. అందులో 19 మద్యం డిపోల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇందులో భాగంగానే గత 3 రోజుల్లోనే దాదాపు రూ. 565 కోట్ల విలువైన లిక్కర్ పంపిణీ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ALSO READ: యువతి ప్రేమకు బందీలుగా మారిన సింహాలు
ఇప్పటికే రూ.3వేల కోట్ల సేల్
ఇలా శనివారం ఒక్కరోజే రూ. 187 కోట్ల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు సమాచారం. ఇక ఆదివారం సెలవు దినం అయినప్పటికీ మద్యం స్టాక్ లిఫ్టింగ్‌కి ఓపెన్ ఉంచనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈనెలలో ఇప్పటికే మద్యం అమ్మకాలు రూ.3వేల కోట్లు దాటినట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు మరో వెయ్యి కోట్లు అదనంగా వచ్చే ఛాన్స్ ఉందని మద్యం వ్యాపారులు, అధికారులు భావిస్తున్నారు.
ALSO READ: యువతకి కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్
మరోవైపు మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ ఓపెన్ ఉంటాయని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లు న్యూ ఇయర్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అనుమతితో నడిచే ఈవెంట్లకు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు కాంగ్రెస్ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.