BIG BREAKING : స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.  మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్‌ టి. మాధవిదేవితో కూడిన బెంచ్ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.   

New Update
ts high

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.  మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్‌ టి. మాధవిదేవి తీర్పు వెలువరించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈసీ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం

అయితే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ 60 రోజుల సమయం కోరగా ఈసీ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. అలాగే రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం 30 రోజుల సమయం కోరగా ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా కోర్టు అంగీకరించింది.

కాగా గతేడాది జనవరితో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసింది. అయినప్పటికీ  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని పలువురు మాజీ సర్పంచులు సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ టి.మాధవిదేవి ఇవాళ తీర్పు వెలువరించారు.  

ఇక గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం  సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించింది.

Advertisment
తాజా కథనాలు