TS: నలుగురు కలెక్టర్లకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

రైతుల ఆత్మహత్య పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు నలుగురు కలెటర్లకు నోటీసులు ఇచ్చింది. యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.

New Update
High Court

తెలంగాణ రైతుల ఆత్మహత్యల విషయంపై గత ఏడాది హైకోర్టు లో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు అయింది. అయితే దాని విచారణ అప్పుడే జరిగింది. దాని తరువాత రైతులకు పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే అవి ఇప్పటివరకు రైతు కుటుంబాలకు అందలేదు. ప్రభుత్వ అధికారులు ఈ అంశం ఇంకా పరిశీలనలోనే ఉందని చెబుతున్నారు. 4 నెలల్లో చెల్లిస్తామని చెప్పిన అధికారులు ఏడాది దాటినా పట్టించుకోలేదు.

నలుగురు కలెక్టర్లకు..

దీంతో ఏడాది దాటినా బాధితులకు పరిహారం అందకపోవడంపై కొండల్‌ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై విచారణ చేపట్టిన హై కోర్టు ఈ రోజు నలుగురు తెలంగాణ కలెక్టర్లకు నోటీసులను జారీ చేసింది. యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద ఈ పిటిషన్‌ను ఎందుకు స్వీకరించకూడదో చెప్పాలని కోర్టు నోటీసులో ప్రశ్నించింది. తమకు కలెక్టర్లు వెంటనే జవాబులు ఇవ్వాలని ఆదేశించింది. 

Also Read: Manoj: అంతా వదిన వల్లనే–మంచు మనోజ్

Advertisment
తాజా కథనాలు