Manoj: అంతా వదిన వల్లనే–మంచు మనోజ్

ఫ్యామిలీ గొడవంతా వదిన వాళ్ల ఫ్యామిలీ వల్లేనని చెబుతున్నారు మంచు మనోజ్. ఆర్టీవీకిచ్చిన ఎక్స్‌క్లూసివ్ ఇంటర్వూలో గొడవకు కారణాలు క్లియర్‌‌గా చెప్పారు.  తన తండ్రి కంపెనీలన్నీ వదిన వాళ్ళు కుటుంబసభ్యులే చూస్తున్నారని ఆరోపించారు. 

New Update

నాన్న మోహన్‌బాబుతో గొడవ గురించి మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు. తమ గొడవలకు కారణం అంతా విష్ణు భార్య వెరోనికా, ఆమె కుటుంబ సభ్యుల వల్లనే అన్నారు. విష్ణు, వదిన కంపెనీలన్నీ వదిన వాళ్ల అమ్మ చూసుకుంటోంది. 
సీసీ రెడ్డి ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందేనన్నారు మనోజ్. వదిన వాళ్ల అమ్మ, నాన్నకు అమెరికాలో ఎంట్రీ లేదు. వాళ్లు అమెరికాకు వెళ్తే అరెస్టవుతారు. అందుకే వాళ్లు దుబాయిలో సెటిల్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. 

మా నాన్న దేవుడు..

మా నాన్న చేసే పనుల చుట్టే విష్ణు వ్యాపారం సాగుతోంది. విష్ణు సోషల్‌మీడియా టీమ్‌..ట్రస్ట్‌ కిందే పని చేస్తుందని మనోజ్ అంటున్నారు.వినయ్ అనే వ్యక్తి వదిన వాళ్ల కుటుంబానికి సన్నిహితుడు. సీసీ కెమెరాల విషయంలో ఇతని గురించి ప్రత్యేకంగా వచ్చింది. తన నాన్నతో గొడవకు ఇతను కూడా ఒక కారణ అని మనోజ్ చెప్పారు.  ప్రస్తుతం తాను భైరవ సినిమా షూటింగ్‌లో ఉన్నానని మనోజ్ అన్నారు. తన తండ్రి మోహన్ బాబు దేవుడని...ఆయన తప్పేమీ లేదని అన్నారు. వదిన, వాళ్ళ కుటుంబ సభ్యుల వల్లనే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయని మనోజ్ అన్నారు. విష్షు, వదిన కలిపి అన్నీ కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. 

Also Read: NIA: ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో ఎన్‌ఐఏ సోదాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు