/rtv/media/media_files/2025/04/07/yQ7PM9YrrRziKGMFAZLL.jpg)
assistant-professors-in-uni
రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తూ జీఓ21 జారీ విడుదల చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నియమించిన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ మార్గదర్శకాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం రిలీజ్ చేశారు.
కొత్త మార్గదర్శకాలకు ఆమోదం
అయితే గతంలో తీసుకువచ్చిన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం రద్దు చేస్తూ కొత్త మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. మొత్తం మూడు దశల్లో రిక్రూట్ మెంట్ పూర్తిచేస్తారు. ప్రతీ యూనివర్సిటీలోనూ కమిటీ ఏర్పాటు చేసి, రోస్టర్ విధానం, రిజర్వేషన్ విధానానికి సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేస్తారు. దీనికి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నాయకత్వం వహించాల్సి ఉంటుంది.
మొదటి దశలో అకడమిక్ రికార్డ్, పరిశోధన ప్రదర్శనలకు సంబంధించి మొత్తం 50 మార్కులను కేటాయిస్తారు. యూనివర్సిటీ వీసీ, ఉన్నత విద్యా మండలి సబ్జెక్ట్ నిపుణుడు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, డిపార్ట్‌మెంట్ ముఖ్యుడు మార్కుల స్క్రూటినీ చేస్తారు. అభ్యర్థికి సంబంధించి యూజీ నుంచి రీసెర్చ్ వరకూ వివిధ విద్యాస్థాయిల్లో మార్కులను ఖరారు చేస్తారు. మొత్తం వంద మార్కుల్లో ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి. ఇక టీచింగ్ నైపుణ్యానికి 30 మార్కులు, మిగతా 50 మార్కులను యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ విభాగాల నుంచి అభ్యర్థి సాధించిన మార్కుల శాతం ఆధారంగా తీసుకుంటారు.
నాలెడ్జ్ అండ్ స్కిల్స్‌కు 30 మార్కులు ఇస్తారు. ఈ మార్కులను టీచింగ్, బుక్ ఆథర్‌షిప్, జాయింట్ ఆథర్ షిప్, ఎడిట్ ఆథర్‌షిప్, కో–ఎడిటర్ ఆథర్‌షిప్, పోస్టు–డాక్టోరల్ షిప్‌గా విడగొడతారు. ఈ మార్కులను ఆయా సబ్జెక్టు లెక్చరర్లు పరిశీలించి, నిర్ణయిస్తారు. ఇంటర్వ్యూకు 20 మార్కులు ఇస్తారు. ఇందులో సబ్జెక్టు ప్రజెంటేషన్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, ఓవరాల్ పర్సనాలిటీ, నైపుణ్యాన్ని బట్టి మార్కులు వేయడం జరుగుతోంది. రిక్రూట్ మెంట్ ప్రక్రియకు రేవంత్ ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలపడంతో వర్సిటీలకు 12 సంవత్సరాలుగా ఉన్న సమస్య త్వరలో తీరనుంది.
Also Read : Fake Hair Growth : ఘరానా మోసగాడు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండ్లు కొట్టి పరార్!