తెలంగాణ ప్రభుత్వం 9 విశ్వవిద్యాలయాలు వైస్ ఛాన్సలర్లను నియమించింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా వర్సిటీలో వైస్ ఛాన్స్‌లర్లను నియమించిన జాబితా ఇదే.
1. పాలమూరు విశ్వవిద్యాలయం - ప్రొఫెసర్ జి ఎన్ శ్రీనివాస్
2. కాకతీయ యూనివర్సిటీ - ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి
3. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి - ప్రొఫెసర్ కుమార్ మొగ్లారామ్
4. శాతవాహన యూనివర్సిటీ - వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ ఉమేష్ కుమార్
5. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం - ప్రొఫెసర్ నిత్యానందరావు
6. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం - ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్
7. తెలంగాణ యూనివర్సిటీ - ప్రొఫెసర్ యాదగిరిరావు
8. ప్రొ. జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, హైదరాబాద్ - ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య
9. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం - ప్రొఫెసర్ రాజి రెడ్డి
Also Read: ఫుట్‌పాత్ ఆక్రమణలే టార్గెట్.. హైడ్రా నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!
ఈ ఏడాది మే నెలలో రాష్ట్రంలో యూనివర్శిటీల వైస్ ఛాన్స్‌లర్ల పదవీ కాలం ముగిసింది. దీంతో కొత్త వీసీల నియామకం కోసం గతంలో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఆయా వర్శిటీలకు పెద్ద ఎత్తున అప్లికేషన్‌లు వచ్చాయి. కాకతీయ యూనివర్శిటీకి ఈసారి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. గతంలో పది నుంచి 12 మాత్రమే రాగా ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య 55కు చేరింది. కేయూ 15వ వీసీ పోస్ట్ కోసం ప్రొపెసర్‌గా పదేళ్ల అనుభవం కలిగిన వారిలో పాటు మాజీ వీసీలు, రిటైర్ట్ ప్రొఫెసర్లు కూడా పోటీపడ్డారు.
Also Read: Isha ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
ఇన్ని నెలలుగా రాష్ట్రాల యూనివర్శిటీలకు వీసీలు లేకపోవడంతో విద్యార్థుల నుంచి నిరసనలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే వర్సిటీలల్లో అనేక సమస్యలు ఉన్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. వెంటనే వీసీలను నియమించాలంటూ గతంలో నిరసనలు కూడా జరిగాయి. అయితే ఎట్టకేలకు వీసీల నియామకంపై గత కొంత కాలంగా ప్రభుత్వం కసరత్తులు చేసింది. ఈసారి ప్రభుత్వం మారడంతో వీసీల నియామకం కూడా కాస్త ఆలస్యంగా జరిగింది. ఎట్టకేలకు నియామకం అయిన వీసీల జాబితాను విడుదల చేసింది.
Also Read: షేక్ హసీనాను మోదీ బంగ్లాదేశ్‌కి అప్పగిస్తారా?
Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్