BREAKING: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. దసరా నుంచి రైతు భరోసా నగదును అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. నిధులు రెడీ చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు.

CM revanth
New Update

Rythu Bharosa :  రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. దసరా నుంచి రైతు భరోసా నగదును అందించేందుకు కార్యాచరణ చేపట్టింది. నిధులు రెడీ చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. ఎకరాకు రూ.7,500 చొప్పున పెట్టుబడి సాయం అందించనుంది. దాదాపు రూ.10 వేల కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. సాగు భూములకే సాయం అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

వ్యవసాయేతర భూములకు రైతు భరోసా సాయం ఇవ్వొద్దని ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో  రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెలలో గైడ్‌లైన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూముల గుర్తించనున్నారు. కోటి 29 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు అంచనా వేశారు. ఏడున్నర ఎకరాలకు సీలింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

#rythu-bharosa #cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe