Rythu Bharosa: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) చెప్పారు. అలాగే రూ.2 లక్షల లోపు రుణమాఫీని కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. రూ.2 లక్షలకుపైగా రుణాలున్న రైతులకు వచ్చే నెల నుంచి విడతల వారీగా రుణమాఫీ డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు. రూ.2 లక్షల లోపు పంట రుణాలున్న రైతులు ఇంకా నాలుగు లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్న మాట. వీరందరికీ దీపావళికి ముందే సాయం అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఆ తర్వాతే రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణమాఫీని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో కడియం లొల్లి.. తలపట్టుకున్న పెద్దలు!
ఇక రైతు భరోసా సాయాన్ని రూ. 15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు విడతల్లో రూ. 7,500 చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించనుంది. త్వరలోనే ఈ నిధులు కూడా విడుదల చేస్తామని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి రుణమాఫీతో పాటు రైతు భరోసా నిధుల కూడా విడుదల అయితే రైతులకు దీపావళికి రెండు కానుకలు అందినట్లు అవుతుంది. ఇవి ఎంతవరకు అమలు అవుతాయో చూడాలి. మరోవైపు వరి పంట వేసే రైతులకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ కూడా అందించనున్నట్లు మంత్రి చెప్పారు. ధాన్యం కొనుగోలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు.
ఇది కూడా చదవండి: నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
రుణమాఫీ జరగలేదు...
కాగా రైతు రుణమాఫీ ప్రారంభించి చాలా రోజులు కావస్తోంది. అయినా ఇంకా చాలా మందికి రుణమాఫీ జరగలేదు. దీంతో వీలైనంత త్వరగా రుణమాఫీ పూర్తి చేయాలని రైతుల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కొందరు రైతులకు సాంకేతిక కారణాలతో రుణమాఫీ నిలిచిపోయింది. ఆధార్, రేషన్ కార్డులో పేర్లు తప్పుగా ఉండటం, బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ కాకపోవడం వంటి కారణాలతో వేలాది మంది రైతులకు సాయం అందలేదు.
ఇది కూడా చదవండి: విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా?
ఇది కూడా చదవండి: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి