రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్.. 5 లక్షల మంది జాబితా సిద్ధం!

రుణమాఫీ కాని రైతులకు తెలంగాణ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. 5లక్షల మంది అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ రెడీ చేసింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రైతుల ఖాతాల్లో మొత్తం రూ.5 వేల కోట్లు జమకానున్నాయి. రేషన్ కార్డులేని వారికి కూడా రుణమాఫీ కానుంది.

New Update
ddddrerr

Runamafi: రుణమాఫీ కాని రైతులకు తెలంగాణ సర్కార్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. సాంకేతిక కారణాలతోపాటు ఇతరత్ర సమస్యల కారణంగా ఆగిపోయిన రుణమాఫీని క్లియర్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మూడు విడతల్లో 2 లక్షల మేర రుణాలు మాఫీ చేయగా.. మిగిలిన 5 లక్షల మంది అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ రెడీ చేసింది. దీనిపై ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాగానే  రైతుల ఖాతాల్లో మొత్తం రూ.5 వేల కోట్లు జమకానున్నాయి.

రేషన్ కార్డులేని రైతు కుటుంబాలకు..

అలాగే రేషన్ కార్డులేని రైతులకు కూడా రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రామాల వారీగా రేషన్ కార్డులేని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకుపైగా రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ కాలేదని అధికారులు నిర్ధారించారు. ఆధార్, బ్యాంకు పాసుబుక్‌లలో తప్పుగా ఉన్న పేర్లను కూడా అధికారులు సవరించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 20 వేలకు పైగానే.. ఆధార్, బ్యాంక్ అకౌంట్ తప్పులను అధికారులు సరిచేసినట్లు సమాచారం. 

తెలంగాణలో రేవంత్ సర్కార్ జూలై 18వ తేదీన రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతలో 11 లక్షల 34 వేల రైతులకు లక్ష రుణం చేసింది. ఇందుకు 6 వేల కోట్ల నిధులు జమచేసింది. జూలై 30న రెండో విడతలో లక్ష నుంచి లక్షన్నర వరకు రుణాలున్న 6 లక్షల 40 వేల మంది అన్నదాతల ఖాతాల్లో 6 వేల 90 కోట్లు జమ చేసింది. ఆగస్టు 17న మూడో విడుతలో భాగంగా లక్షన్నర నుంచి 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసింది. 

ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు..

ఇదిలా ఉంటే.. రుణమాఫీపై ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు మహా ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా అర్హులైన రైతులందరికీ వెంటనే రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు