Case File On KCR: 'మాజీ సీఎం KCRపై కేసు'

TG: జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో అక్రమాలపై కేసు నమోదు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్, జగదీష్ రెడ్డిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

author-image
By V.J Reddy
New Update
kcr

Case File On KCR: మాజీ సీఎం కేసీఆర్‌పై కేసు పెట్టేందుకు రేవంత్‌ సర్కార్‌ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో అక్రమాలపై కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై విచారణ జరిపి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.  గత నెల 28వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 

Also Read: అయ్యా.. మాకు న్యాయం చేయండి.. రంగనాథ్ కు ఆ బాధితుల వినతులు!

ఛత్తీస్‌గడ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలులోనూ అక్రమాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ సీఎం కేసీఆరే ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారని కమిషన్‌ నిర్ధారణ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్‌రెడ్డిపైనా కేసు పెట్టే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ చేయాలని ప్రభుత్వానికి లోకూర్‌ కమిషన్‌ సూచనా చేసింది.  కమిషన్‌ నివేదికపై త్వరలో సీఎం రేవంత్‌ సమీక్ష చేయనున్నారు. అసెంబ్లీలోనూ నివేదికను పెట్టి చర్చించేలా ప్లాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: నిండా ముంచింది.. కాంగ్రెస్‌పై KTR గరం!

గతంలో కేసీఆర్‌కు నోటీసులు....

కాగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో అక్రమాలపై విచారణ జరిపేందుకు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని నాటి సీఎం కేసీఆర్ కు నోటీసులు కూడా అందాయి. నోటీసులపై స్పందిస్తూ కేసీఆర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మీడియాతో మాట్లాడంపై జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిపై సుప్రీంకోర్టులో కేసీఆర్ కేసు వేశారు.

Also Read: వైఎస్‌ ఫ్యామిలీ రెండు ముక్కలు.. వారందరి సపోర్ట్ జగన్ కే!

కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ నుంచి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తప్పుకున్నారు. ఆ తర్వాత మదన్‌ బి.లోకూర్‌ ఆధ్వర్యంలో కమిషన్‌ విచారణ చేపట్టింది. గత నెలతోనే ఈ  కమిషన్‌ గడువు ముగిసింది. ఇప్పటికే విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిషన్  అందజేసింది. కాగా సమీక్ష అనంతరం సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఒకవేళ కేసీఆర్ ఇందులో ముద్దాయిగా తేలితే అరెస్ట్ చేస్తారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు