Yoga instructor: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ఆయూష్ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు పార్ట్ టైం విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 421 పోస్టులను పురుషులకు కేటాయించగా.. 421 పోస్టులకు మహిళలకు ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అప్లికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అర్హతలు:
విద్యా అర్హతలతోపాటు అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూలు:
సెప్టెంబర్ 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 తేదీల మధ్య వీటిని చేపడతారు.
వరంగల్ జోన్:
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఇంటర్వూలు ఉంటాయి.
హైదరాబాద్ జోన్:
హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో ఇంటర్వూలను నిర్వహిస్తారు.
వేతనం:
ఒక్కో సెషన్‌కు రూ.250 చొప్పున రెమ్యునరేషన్ చెలిస్తారు. పురుష యోగా ఇన్‌స్ట్రక్టర్లుకు నెలకు రూ. 8వేలు. మహిళ యోగా ఇన్‌స్ట్రక్టర్లు నెలకు రూ. 5వేలు ఇస్తారు.
నెలకు కనీసం 32 యోగా సెషన్లు..
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సెషన్ల వారీగా విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రతి సెషన్ కూడా గంటసేపు ఉంటుంది. నెలకు కనీసం 32 యోగా సెషన్లకు అటెండ్ కావాల్సి ఉంటంది. ఇక ఫీమేల్ యోగా ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం 20 యోగా సెషన్లకు హాజరుకావాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ సంప్రదించండి. https://ayush.telangana.gov.in/