Telangana : తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలకు దసరా సెలవులను ప్రకటిస్తూ ఓ ప్రకటన జారీ చేసింది. మరి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు? స్కూళ్లు తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలుసుకుందాం. వచ్చే నెలలో దసరా పండగ నేపథ్యంలో మొత్తం 13 రోజుల పాటు సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి (బుధవారం) నుంచి 14వ తేదీ(సోమవారం) వరకు సెలవులుగా ప్రకటించింది.
Dasara Holidays...
ముందుగా గాంధీ జయంతికి సెలువు ఉండగా.. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక జూనియర్ కాలేజీల విషయానికి వస్తే అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
13 రోజులు సెలవుల...
అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు అంటే మొత్తంగా 13రోజులు సెలవుల తర్వాత అక్టోబర్ 15న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఇక కాలేజీలు అక్టోబర్ 14న తెరుచుకోనున్నాయి. వరుసగా 13 రోజులు సెలవులు అని ప్రకటించడంతో విద్యార్థుల సంతోషానికి అవధులు లేవు.
Also Read : వాటర్ హీటర్ షాక్ కొట్టి వ్యక్తి అక్కడికక్కడే మృతి