Telangana: తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలను పెంచే దిశగా ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలకు సమానం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో బీరుపై రూ.20, లిక్కర్‌పై క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.70 వరకు పెంచే అవకాశాలుంటాయని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!
ఎక్సైజ్ శాఖలో ఆదాయం....
ధరలు పెంచడం ద్వారా ప్రతి నెలా రూ.1000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఎక్సైజ్ శాఖలో ఆదాయం రావడం లేదు. రాష్ట్రంలో గుడుంబాతో పాటు అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు పెరిగాయని ఆ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో నమోదు చేసిన కేసుల సంఖ్య తెలుపుతుంది.
Also Read: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటలోగా దర్శనం..!
గతేడాది మొదటి ఆరు నెలల్లో 9,108 గుడుంబా కేసులు నమోదు అవ్వగా, ఈ ఏడాది అదే సమయంలో 18,826 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. అంటే రెట్టింపు కేసులు నమోదు అవ్వడంతో పాటు పది వేల మందికి పైగా గుడుంబా కేసుల్లో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ మద్యం సరఫరా, గుడుంబా తయారీని అరికట్టేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు కఠినంగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల ద్వారా రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
Also Read: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!
ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆదాయం ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్ ద్వారా మరో రూ.8,040 కోట్లు వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఆ రెండింటి ద్వారా దాదాపు రూ.17,533 కోట్ల రాబడి వచ్చినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన ఆరు నెలల్లో ఇదే మొత్తం వస్తుందని అంచనా వేస్తే, ఈ ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్లకు మించే అవకాశం లేదని సమాచారం.