TG Education : తెలంగాణలో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు రద్దు?

తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇంటర్, డిగ్రీ, వర్సిటీల అధ్యాపకుల నియామకాలకు ఒకే కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ed
New Update

TG Education : విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కసరత్తులు చేస్తోంది. ఇంటర్, డిగ్రీ, టెక్నికల్, వర్సిటీలకు సంబంధించిన నియామకాలకు ఒకే కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్ రద్దు చేసి.. కాలేజీ సర్వీస్‌ కమిషన్‌ను తెర మీదకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తోందని, సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని సాంకేతికవిద్య విభాగం అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం.

Also Read :  ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ..మరో రెండు గ్యారంటీల అమలుపై ఫోకస్

నియామకాల్లో అవకతవకలు..

తెలంగాణలో ఉన్న 11 యూనివర్సిటీలు తమ నియామకాలను కామన్‌ నోటిఫికేషన్‌ ద్వారా చేపడుతున్నాయి. కానీ ఈ విధానం వల్ల అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో గత ప్రభు­త్వం అన్ని యూనివర్సిటీలకు కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ సహా, పలువురు విద్యావేత్తలను ఈ బోర్డులో సభ్యులుగా చేర్చింది. కానీ ఈ బోర్డు ఇంతవరకూ నియామకాలు చేపట్టకపోవడంతో యూనివర్సిటీల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అయితే కాలేజీ సర్వీస్‌ కమిషన్‌ ఉమ్మడి రాష్ట్రంలోనే అమలులో ఉండగా.. కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను గుర్తించి, కమిషన్‌కు సమాచారం ఇస్తారు. దీంతో కమిషన్‌ కమిటీ పరీక్షలు చేపడుతోంది.

Also Read : 

నాణ్యమైన విద్యను అందించే దిశగా..

ఇక 1985లో ఈ కమిషన్‌ను రద్దు చేయగా.. ఆ తర్వాత నియామకాలన్నీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే కాలేజీ సర్వీస్‌ కమిషన్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు అధికారవర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్‌ కాలేజీ, యూనివర్సిటీల్లో అర్హత లేని ఫ్యాకల్టీని నియమిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాకల్టీ అర్హతలను ఈ కమిషన్‌ పరిశీలించి, నాణ్యమైన విద్యను అందించే దిశగా ముందుకెళ్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే.. 9 పాలిటెక్నిక్‌ కాలేజీలను ఇంజనీరింగ్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఐటీఐలను కూడా ఆధునికీకరించాలని, సాంకేతిక విద్య కాలేజీల్లో నియామకాలనూ ఈ కమిషన్‌ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారి ఓ సమావేశంలో ప్రస్తావించారు.

Also Read : 

#cm-revant #tg-education
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe