జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్.. సీఎం రేవంత్ తో పీసీసీ చీఫ్ కీలక భేటీ!

జూబ్లీహిల్స్ అభ్యర్థిపై చర్చించేందకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేడు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అభ్యర్థుల పేర్లను సూచిస్తూ నివేదిక ఇవ్వాలని ఆయన సూచించినట్లు సమాచారం.

New Update
PCC Chief CM Revanth Reddy

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. మరో వారంలోగా అభ్యర్థిని ప్రకటించాలన్న లక్ష్యంతో కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్ నేడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అభ్యర్థి ఎంపికపై చర్చించారు.ఇన్ఛార్జులుగా ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులతో చర్చించి నివేదిక ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ కు రేవంత్ సూచించినట్లు తెలుస్తోంది. నివేదికలో అభ్యర్థుల పేర్లు, వారి బలాబలాలతో కూడిన పూర్తి వివరాలు ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థిని ఖరారు చేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే బీసీ అభ్యర్థిని ఎంపిక చేయాలని సీఎం రేవంత్ తో పాటు హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను పెంచడంతో ఇప్పటికే కాంగ్రెస్ సక్సెస్ అయ్యిందని.. ఇప్పుడు జూబ్లిహిల్స్ లో కూడా బీసీ అభ్యర్థి ని బరిలోకి దించితే కలిసి వస్తుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. 

జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ప్రధానంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఉన్నారు. మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు అయిన కంజర్ల విజయలక్ష్మి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమ కుటుంబానికి ఉన్న మంచి పేరు, తాను నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు కలిసి వస్తున్నాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో.. కాంగ్రెస్ కూడా మహిళా అభ్యర్థికే అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. మరో వైపు.. టికెట్ తనకు గ్యారెంటీ అని అంజన్ కుమార్ యాదవ్ ధీమాగా ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంపీగా పదేళ్ల పాటు పని చేసిన అనుభవం, తాను చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి హైకమాండ్ తన పేరును ఫైనల్ చేస్తుందని ఆయన చెబుతున్నారు. హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పని చేసిన తనకు కేడర్ తో మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. 

కార్పొరేటర్ సీఎన్ రెడ్డి అయితే.. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేటర్ గా ప్రజలతో ఉన్న తనకు అవకాశం ఇస్తే గెలుపు గ్యారెంటీ అని అయన చెబుతున్నారు. అయితే.. ఓసీ కావడం ఆయనకు మైనస్ గా మారింది. దీంతో నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ మధ్యనే పోటీ ప్రధానంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు