నితిన్ గడ్కరీ నాకు దగ్గర.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేను కాదు.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తనకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చాలా దగ్గర అని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఒక పార్టీకి ఎమ్మెల్యేను కాదని.. మునుగోడులో అందరికీ ఎమ్మెల్యేనని వ్యాఖ్యానించారు. 

New Update
Komatireddy Rajagopal Reddy Nithin Gadkari

రీజనల్ రింగ్ రోడ్ కారణంగా నష్టపోతున్న రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎంతవరకైనా వెళ్తానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు రైతులతో ఆయన భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. ఇండస్ట్రీస్ కోసం అలైన్మెంట్ మార్చారని ఆరోపించారు. దీంతో రైతులను మోసం చేశారన్నారు. గత ప్రభుత్వం దివిస్ తో కుమ్మక్కైందని ధ్వజమెత్తారు. నేను ఎవరికైనా సహాయం చేస్తానని.. అన్యాయం చేయనన్నారు.

రైతులకు న్యాయం జరగాలన్నది తన కోరిక అని అన్నారు. వీరికి మంచి రేటు ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. అలైన్మెంట్ గురించి మరోసారి అధికారులతో చర్చిస్తానన్నారు. తనకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చాలా దగ్గర అని అన్నారు. తాను ఒక పార్టీకి ఎమ్మెల్యేను కాదన్నారు. తాను మునుగోడులో అందరికీ ఎమ్మెల్యేనని వ్యాఖ్యానించారు. తనతో కాకుంటే ఇంకా ఎవరితో ఈ పని కాదన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్య తీర్చేందుకు ప్రయత్నం చేస్తానని భరోసానిచ్చారు. తనకు పార్టీలతో పని లేదని.. మీకోసం నేను పనిచేస్తానన్నారు.

Advertisment
తాజా కథనాలు