హర్యానా, కశ్మీర్ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తెలంగాణ సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. హర్యానా ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో తెలంగాణ కేబినెట్ విస్తరణకు బ్రేక్ ఇచ్చింది. దీంతో కేబినెట్ కూర్పుపై చర్చించేందుకు టీ కాంగ్రెస్ ఏఐసీసీని సంప్రదించనుంది. By srinivas 08 Oct 2024 | నవీకరించబడింది పై 08 Oct 2024 15:23 IST in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి TG CABINET: హర్యానా, కశ్మీర్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపిస్తున్నాయి. విజయం ఖామం అనుకున్న హర్యానాలో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇచ్చారు ప్రజలు. జాట్, దళిత్, మైనార్టీ ఓట్లపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. అయితే హర్యానా రిజల్ట్ కారణంగా.. తెలంగాణ కేబినెట్ విస్తరణకు అధిష్టానం బ్రేక్ ఇచ్చింది. ఆచితూచి కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సామాజిక వర్గాల వారిగా కేబినెట్ కూర్పు ఉండాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై మరోసారి ఏఐసీసీని టీ కాంగ్రెస్ సంప్రదించనుంది. కేబినెట్ బెర్తు ఆశావహుల లిస్ట్ పెద్దదే.. కేబినెట్ విస్తరణలో ఇద్దరు బీసీలు, ఒక మైనారిటీ, ఒక ఎస్సీ, ఇద్దరు ఓసీలకు అవకాశం ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. బీసీలలో ముదిరాజ్ కమ్యూనిటీకి బెర్తు ఖాయంగా కనిపిస్తుంగా.. యాదవ సామాజిక వర్గం నుండి కురుమ లేదా మున్నూరు కాపుకు ఈసారి కేబినెట్లో అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. ఓసీల నుంచి ఒక రెడ్డి, ఒక వెలమకి కేబినెట్‌లో ఛాన్స్ ఇవ్వనుంది. కేబినెట్ బెర్తు కోసం చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. విస్తరణకు మరికొంత ఆలస్యం.. ఉమ్మడి జిల్లాల వారిగా పరిశీలిస్తే.. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు. ఆదిలాబాద్ నుంచి వివేక్ ,ప్రేమ్ సాగర్ రావు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య. ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి నీలం మధు ముదిరాజ్, వాకిటి శ్రీహరి ఉన్నారు. ఇక మైనారిటీ నుంచి అమీర్ అలీ ఖాన్ MLC కి దాదాపు క్యాబినెట్ బెర్తు ఖరారైంది. మున్నూరు కాపునుంచి దానం నాగేందర్, యాదవ సామాజిక వర్గం కురుమ కోటాలో బీర్ల ఐలయ్య క్యాబినెట్ బెర్తు ఆశిస్తున్నారు. స్థానిక సంస్థలు, వచ్చే కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్ గా క్యాబినెట్ కూర్పు ఉండేలా అధిష్టానం ఆలోచన చేస్తోంది. దీంతో సామాజిక వర్గాల కూర్పు నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ మరికొంత ఆలస్యం కానుంది. #cm-revanth #telangana-cabinet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి