TS: కేటీఆర్ పై విచారణ.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

బీజేపీ, బీఆర్ఎస్  రెండూ కవల పిల్లలని...అందుకే ఇప్పటికి 15 రోజులు అవుతున్నా తాము రాసిన లేఖకు గవర్నర్ సమాధానం ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ ఆరోపించారు.  ఢిల్లీలో  జరిగిన ఓ మీడియా సంస్థ కార్యక్రమంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

author-image
By Manogna alamuru
CM Revanth Reddy
New Update

Telangana CM Revanth Reddy: 

గతంలో చంద్రబాబునాయుడు పదేళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఆ తర్వాత పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది..మరో పదండ్లు సీఎంగా కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వంతు వచ్చింది.  రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలో ఉంటుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ కాంగ్రెస్ పార్టీ తన విధాఆన్ని మార్చుకోవాలి. టెస్ట్ మ్యాచ్ లెక్క కాకుండా టీ 20మ్యాచ్‌లలా పని చేయాలి అని చెప్పారు. తన  లక్ష్యం నాలుగు కీలక ప్రాజెక్టులని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనం దాని చుట్టూ హైదరాబాద్ అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి తీరుతానని అన్నారు.  గుజరాత్ మోడల్ కంటే తెలంగాణ మోడల్ వెలిగిపోతోంది. దేశంలో గుజరాత్ మోడల్ కు ప్రత్యామ్నాయం తెలంగాణ మోడల్ గా తీర్చి దిద్దుతా.  నా పోటీ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు సీయోను,  న్యూయార్క్ నగరాలతోనే అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరుగారింటిల అమలుతోపాటు స్వేచ్ఛ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అనే మరో ఏడూ హామీలు కూడా అమలు చేస్తున్నాం అన్నారు రేవంత్. అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ సుపరిపాలన అందించటమే నా లక్ష్యం  అని చెప్పారు. 

మోదీ గుజరాత్‌కు గవర్నర్..

సర్పంచి ఎన్నికకు కూడా బిజెపి మోడీ జపం చేస్తోంది.  దేశంలో ఏ ఎన్నికైన మోడీ వర్సెస్ రాహుల్ అనే విధంగా జరగాలన్నారు రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అభివృద్ధిని మోడీ నాశనం చేస్తున్నారు.  
ఆ రాష్ట్రాలకు పెట్టుబడులు రాకుండా తన సొంత రాష్ట్రం గుజరాత్ కు తరలించకపోతున్నారు. మోడీ గుజరాత్ కు ప్రధానిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ కు రావలసిన పెట్టుబడులను గుజరాత్ అహ్మదాబాద్ కు తరలిస్తున్నారు అంటూ మోదీపై మండిపడ్డారు.  తాజా జనాభా లెక్కల సేకరణ, దాని ఆధారంగా నియోజకవర్గం పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి దక్షిణాది రాష్ట్రాల అవసరమే లేకుండా పోతుంది. అందుకే 1971 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరగాలని తెలంగాణ సీఎం డిమాండ్ చేశారు.  

బీఆర్ఎస్, బీజేపీ కవల పిల్లలు..

నితీష్ కుమార్, చంద్రబాబునాయుడు దయతో మోడీ ప్రభుత్వం నడుస్తోంది.  వాళ్ళిద్దరూ అనుకుంటే ఒక సంవత్సరంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ లు అయితే  కవల పిల్లలు అంటూ రేవంత్ దుయ్యబట్టారు.  ఏసీబీ గవర్నర్ కు లేఖ రాసి 15 రోజులైంది. ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు కేటీఆర్ రెండు రోజులు ఢిల్లీలో చక్కర్లు కొట్టారు. ఆయన వచ్చి వెళ్లిన వెంటనే గవర్నర్ ను ఢిల్లీని పిలిపించినట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు గవర్నర్ దగ్గర నుంచి జవాబు రాలేదని రేవంత్ ఆరోపించారు.  

Also Read: BY Poll: రేపు వాయనాడ్‌తో పాటూ 31 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe