కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందన్నారు. ఏఐసీసీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో అనేక విషయాలను రేవంత్ పంచుకున్నారు. రాష్ట్రంలో తానే ఏఐసీసీని అని అన్నారు. మూసీ ప్రాజెక్టుపై రోజుకు 8 గంటలు పని చేస్తున్నాన్నారు. నవంబర్ మొదటి వారంలో మూసీ పునరుజ్జీవం టెండర్లు ఉంటాయన్నారు. తొలివిడతలో బాపూ ఘాట్ నుంచి 30 కిలోమీటర్లు పునరుజ్జీవ ప్రక్రియ ఉంటుందన్నారు. ఈన వర్కింగ్ స్టైల్ రాజమౌళి స్టైల్‌లో ఉంటుందన్నారు. రామ్ గోపాల్ వర్మ స్టైల్‌లో వెళ్లమంటే నేను వెళ్లన్నారు. పీపీపీ విధానంలో మూసీ ప్రక్షాళన ఉంటుందన్నారు. 140 కోట్లతో డీపీఆర్ తయారీకి ఆదేశాలిచ్చామన్నారు. పునురుజ్జీవంపై త్వరలోనే అఖిలపక్ష భేటీ ఉంటుందన్నారు. మూసీ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. 33 బృందాలతో ఇప్పటికే సర్వే నిర్వహించామన్నారు. మూసీ నిర్వాసితులకు ఫ్రీ ఎడ్యూకేషన్ అందిస్తామన్నారు. ఇంకా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: వీడెవడండీ బాబు.. మందు పార్టీకోసం మంత్రి పొన్నంకి లేఖ!
కేసీఆర్ ను రాజకీయంగా లేకుండా చేస్తా..
కేసీఆర్ ఉనికి లేకుండా చేయడమే తన అభిమతమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం ఆయన కొడుకునే వాడానన్నారు.కేసీఆర్ రాజకీయం ఏడాదిలో ముగుస్తుందన్నారు. కేసీఆర్ అనే పదం ఏడాది తర్వాత వినిపించదన్నారు. భవిష్యత్‌లో కేటీఆర్ ను రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్‌రావును వాడతానన్నారు. బావను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసన్నారు. బావతో కేటీఆర్ రాజకీయం ముగుస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూపైనా రేవంత్ స్పందించారు. దీపావళి అంటే చిచ్చుబుడ్లను చూస్తాం కానీ కేటీఆర్ బావమరిది ఇంట్లో సారా బుడ్లను చూశామన్నారు. దీపావళి దావత్ అలా చేస్తారని మాకు తెలియదని ఎద్దేవా చేశారు. రాజ్ పాకాల ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని.. ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారని ప్రశ్నించారు. దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు దొరికాయన్నారు.