డిజిటల్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన

తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ అప్లికేషన్ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్‌ను విడుదల చేయలేదని స్పష్టం చేసింది.

New Update
hh

తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అప్లికేషన్ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటివరకు ఎలాంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్‌ను విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఇంకా ఎలాంటి అప్లికేషన్లు స్వీకరించడం లేదని పేర్కొంది. గ్రామాల్లో రేషన్ కార్డు లేని కుటుంబాలు ఆ దరఖాస్తు పూర్తి చేసి ఆధార్‌ సంఖ్య, సభ్యుల జనన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ ఫొటో జత చేసి స్థానిక వీఆర్‌ఓలకు ఇవ్వాలని ప్రచారం జరుగుతోంది.  

Also Read: అప్పటిలోగా నక్సలిజం ఖతం.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే!

దీంతో జిరాక్స్ సెంటర్లు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద హడావుడి కనిపిస్తోంది. చివరికి ఈ విషయం ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎలాంటి అప్లికేషన్ విడుదల చేయలేదని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. దళారులను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచనలు చేసింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు