/rtv/media/media_files/2025/01/16/chy8szyjA0koxMeC5kob.jpg)
ktr ed Photograph: (ktr ed)
ఈ రోజు విచారణకు హాజరైన కేటీఆర్ ను ప్రశ్నలతో ఈడీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఫోన్ ను ED తీసుకున్నట్లు సమాచారం. పార్ములా ఈ రేసుకు సంబంధించి ఫోన్లో కేటీఆర్ ఎలాంటి సంప్రదింపులు జరిపారు అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. వారిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈడీ కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కేటీఆర్ తో వారిద్దరు చేసిన వాట్సాప్ చాట్ ను కూడా ఈడీ సేకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ చాట్ ను చూపించి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఈడీ కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఈ రోజు ఉదయం నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం నిజమై కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ పాలిటిక్స్ లో ఊహించని సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.