/rtv/media/media_files/2025/08/21/mlc-kavitha-2025-08-21-11-54-38.jpg)
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నిక కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ ఫ్యామిలీలో మరో చిచ్చురేపింది. తనను అధ్యక్షురాలిగా తొలగించి.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అధ్యక్షుడిగా నియమించడంపై కవిత భగ్గుమన్నారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారని ఫైర్ అయ్యారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో ఈ ఎన్నిక నిర్వహించడాన్ని కూడా ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందన్నారు. ఈ మేరకు కార్మికులకు లేఖ రాశారు. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి గతంలో కేసీఆర్ కు రాసిన లేఖను లీక్ చేశారన్నారు. ఆ కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే తనపై కక్షగట్టారని ఆరోపించారు. ఆ కుట్రదారులు తనను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు లేఖ రాసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు @RaoKavithapic.twitter.com/wcivYFEiZ8
— Jagruthi Talks (@jagruthi_Talks) August 21, 2025
రాష్ట్రంలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు కవిత ఈ రోజు లేఖ రాశారు. పదేళ్లుగా తను ఈ సంఘానికి గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ కార్మికులకు సేవ చేశానన్నారు. ఈ అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రతీ కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా సేవలందించానన్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేశానన్నారు. ఈ క్రమంలో తనపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి:BIG BREAKING: నకిలీ సర్టిఫికేట్లలో 59 మందికి జాబ్స్.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం!
అయితే.. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ ను ఒప్పించి తిరిగి డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్దరించేలా చేశానని గుర్తు చేశారు. తన పోరాటంతో సింగరేణిలో 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించానన్నాను. కార్మికుల క్వార్టర్స్ కు ఉచిత కరెంట్, ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించానని గుర్తు చేశారు. కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ పది రెట్లు పెంచేందుకు కృషి చేశానన్నారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన కార్మికుల పిల్లలకు ఫీ రీయింబర్స్ మెంట్ అందేలా చేశానన్నారు.
ఇది కూడా చదవండి:High Court: చేతులు దులిపేసుకుంటే ఎలా? అందరూ బాధ్యులే.. విద్యుత్ మృతులపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడు తాను గౌరవాధ్యక్షురాలిగా లేకపోయినా ప్రతీ కార్మికుడికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. పదేళ్లుగా ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలందించానో ఇప్పుడు కూలా అలాంటి సేవలే అందిస్తానన్నారు. కార్మికులందరికీ అండగా ఉంటానన్నారు. ఏ చిన్నకష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు.