MLC Kavitha: నిజామాబాద్ లో నన్ను ఓడించింది వాళ్లే.. తప్పకుండా సీఎం అవుతా.. కవిత సంచలన వ్యాఖ్యలు!
నిజామాబాద్ లో తనను ఓడించింది సొంత పార్టీ నేతలేనని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలుసన్నారు. ఎప్పుడో సారి తాను సీఎం అవుతానన్నారు. సీబీఐ, ఈడీ కేసుల సమయంలో పార్టీ నుంచి తనకు రావాల్సినంత సపోర్ట్ రాలేదన్నారు.
కేసీఆర్ దేవుడు అని.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు ఎమ్మెల్సీ కవిత. దీంతో ఆమె బీఆర్ఎస్ కు దూరం అవుతున్నారని.. కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కొన్ని రోజులుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కవిత. తాను సొంత పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీ కాదన్నారు. జాగృతి, బీఆర్ఎస్ రెండూ బలంగా ఉండాలన్నారు. తన ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నానన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా.. ఉంటాను కూడా అంటూ తేల్చి చెప్పారు. లేఖ లీక్ తర్వాత కేటీఆర్‌తో కొంత గ్యాప్ ఉందన్నారు.
కేసీఆర్ చుట్టూ మంచి వాళ్లతో పాటు దెయ్యాలు కూడా ఉన్నాయన్నారు. 11 ఏళ్లుగా పార్టీలో ఎన్నో ఇబ్బందులు పడ్డానన్నారు. నిజామాబాద్‌లో తన ఓటమి వెనుక సొంత పార్టీ నేతల కుట్ర ఉందన్నారు. కేసీఆరే తనకు ఎప్పటికైనా లీడర్ అని స్పష్టం చేశారు. ఇప్పడు కాకున్నా పదో, పదిహేను ఏళ్లుకు సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్న వారికి తప్పకుండా ఉన్నతమైన పదవి చేపట్టి ప్రజలకు సేవ చేయాలన్న కోరిక ఉంటుందన్నారు. హరీష్ రావుకు సైతం ఇలాంటి ఆలోచన తప్పుకుండా ఉండొచ్చన్నారు.
దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుకున్నాడు అని @RaoKavitha ఎవర్ని ఉద్దేశించి చెప్తున్నారు ?? తన ఆవేదన చెప్పుకోవడానికేనా కవిత ఈ పోడ్కాస్ట్ లో మాట్లాడింది? pic.twitter.com/ZfDtfGtKd6
కేసీఆర్ ఉన్నన్ని రోజులు తమ పార్టీలో ఆయనే సీఎం అని స్పష్టం చేశారు కవిత. సీబీఐ, ఈడీ కేసుల సమయంలో పార్టీ నుంచి తనకు రావాల్సినంత సపోర్ట్ రాలేదన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేటలా నిజామాబాద్‌ను అభివృద్ధి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నిసార్లు నిధులు అడిగినా ఆనాటి తమ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తన మార్క్ చూపించాలని ట్రై చేసినా చేయనివ్వలేదని ఆరోపించారు. పార్టీ ప్రక్షాళన జరగాల్సిన విషయం కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. రాజకీయాలు ప్రతీకారంగా మారాయన్నారు.
💥నాకు చాలా దగ్గరగా ఉండే వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయి ..
💥సిట్ నుండి వారికి నోటీసులు కూడా వచ్చాయి!
💥 ఇంట్లో వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసారు అంటే నాకే బాధగా ఉంది!
తాను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కేసీఆర్ తనకు ముందే చెప్పాడన్నారు. డిసెంబర్లో ఓడిపోయిన తర్వాత జనవరిలోనే తనతో పాటు భర్త అనిల్ ని కూడా పలిచి ధైర్యంగా ఉండాలని చెప్పాడన్నారు. తాను జైలులో ఉన్న సమయంలో లాయర్ ఫీజులను సైతం కేసీఆరే చెల్లించాడన్నారు. ఇందుకోసం స్వయంగా తన తండ్రే చెక్కులు రాసినట్లు వివరించారు కవిత.
MLC Kavitha: నిజామాబాద్ లో నన్ను ఓడించింది వాళ్లే.. తప్పకుండా సీఎం అవుతా.. కవిత సంచలన వ్యాఖ్యలు!
నిజామాబాద్ లో తనను ఓడించింది సొంత పార్టీ నేతలేనని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలుసన్నారు. ఎప్పుడో సారి తాను సీఎం అవుతానన్నారు. సీబీఐ, ఈడీ కేసుల సమయంలో పార్టీ నుంచి తనకు రావాల్సినంత సపోర్ట్ రాలేదన్నారు.
కేసీఆర్ దేవుడు అని.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు ఎమ్మెల్సీ కవిత. దీంతో ఆమె బీఆర్ఎస్ కు దూరం అవుతున్నారని.. కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కొన్ని రోజులుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కవిత. తాను సొంత పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీ కాదన్నారు. జాగృతి, బీఆర్ఎస్ రెండూ బలంగా ఉండాలన్నారు. తన ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నానన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా.. ఉంటాను కూడా అంటూ తేల్చి చెప్పారు. లేఖ లీక్ తర్వాత కేటీఆర్‌తో కొంత గ్యాప్ ఉందన్నారు.
కేసీఆర్ చుట్టూ దెయ్యాలు..
కేసీఆర్ చుట్టూ మంచి వాళ్లతో పాటు దెయ్యాలు కూడా ఉన్నాయన్నారు. 11 ఏళ్లుగా పార్టీలో ఎన్నో ఇబ్బందులు పడ్డానన్నారు. నిజామాబాద్‌లో తన ఓటమి వెనుక సొంత పార్టీ నేతల కుట్ర ఉందన్నారు. కేసీఆరే తనకు ఎప్పటికైనా లీడర్ అని స్పష్టం చేశారు. ఇప్పడు కాకున్నా పదో, పదిహేను ఏళ్లుకు సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్న వారికి తప్పకుండా ఉన్నతమైన పదవి చేపట్టి ప్రజలకు సేవ చేయాలన్న కోరిక ఉంటుందన్నారు. హరీష్ రావుకు సైతం ఇలాంటి ఆలోచన తప్పుకుండా ఉండొచ్చన్నారు.
కేసీఆర్ ఉన్నన్ని రోజులు తమ పార్టీలో ఆయనే సీఎం అని స్పష్టం చేశారు కవిత. సీబీఐ, ఈడీ కేసుల సమయంలో పార్టీ నుంచి తనకు రావాల్సినంత సపోర్ట్ రాలేదన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేటలా నిజామాబాద్‌ను అభివృద్ధి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నిసార్లు నిధులు అడిగినా ఆనాటి తమ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తన మార్క్ చూపించాలని ట్రై చేసినా చేయనివ్వలేదని ఆరోపించారు. పార్టీ ప్రక్షాళన జరగాల్సిన విషయం కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. రాజకీయాలు ప్రతీకారంగా మారాయన్నారు.
అరెస్ట్ అవుతానని నాన్న ముందే చెప్పాడు..