/rtv/media/media_files/2025/10/17/konda-vishweshwar-reddy-2025-10-17-16-46-59.jpg)
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. వికారాబాద్ అధ్యక్షుడి నియామకం అయిన నాటి నుంచి విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనను మార్చాలని పట్టుబడుతున్నారు విశ్వేశ్వర్ రెడ్డి. ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫుట్బాల్ తీసుకువచ్చి మరీ తన అసంతృప్తిని అగ్రనాయకులకు తెలిపారు విశ్వేశ్వర్ రెడ్డి. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ విశ్వేశ్వర్ రెడ్డి మొరను ఆలకించింది. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొప్పు రాజశేఖర్ రెడ్డిని రాజీనామా చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా కూడా చేశారు. ఆ వెంటను ఆయన రాజానామాను ఆమోదించారు. దీంతో కరణం ప్రహ్లాద్ రావును వికారాబాద్ జిల్లా కన్వీనర్ గా నియమించారు రాంచందర్ రావు. రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడిని కూడా మార్చాలని విశ్వేశ్వర్ రెడ్డి గత కొంత కాలంగా పట్టుపడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి రూరల్ అధ్యక్షుడు భూపాల్ గౌడ్ కు హైకమాండ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో విశ్వేశ్వర్ రెడ్డి కాస్త శాంతించినట్లు తెలుస్తోంది. ఇంకా కొన్ని జిల్లాల్లో అధ్యక్షుల పంచాయితీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వారిని కూడా వీలైనంత త్వరగా మార్చాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.