BIG BREAKING: 'తెలంగాణకు కొత్త సీఎం'

తెలంగాణకు కొత్త సీఎం రాబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయిట్మెంట్ ఇవ్వడం మానేశాడని ఆరోపించారు. 2025 డిసెంబర్ లోపు ఎప్పుడైనా తెలంగాణకు కొత్త సీఎం రావొచ్చని జోస్యం చెప్పారు.

New Update

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం మానేశాడన్నారు. ఇప్పటికే ఏడు సార్లు రాహుల్ గాంధీ రేవంత్ అపాయింట్మెంట్ తిరస్కరించాడన్నారు. ఈ రోజు మీడియాతో చిట్ చాట్ చేసిన మహేశ్వరరెడ్డి తనదైన శైలిలో పలు అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరికి కేరళలో ప్రియాంక గాంధీ కూడా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. రేవంత్ హాలిడే పీరియడ్ అయిపోయిందన్నారు. ఇక ఆయనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు!

రేవంత్ పై ఫిర్యాదు..

2025 జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా రాష్ట్రానికి కొత్త సీఎం రావచ్చని బాంబు పేల్చారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కొత్త సీఎం వేటలో పడిందన్నారు. మూసీ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ హైకమాండ్ భావించిందన్నారు. ఈ విషయంపై మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న ఒరిజినల్ మంత్రులు రేవంత్ పై హై కమాండ్ కు ఫిర్యాదు చేశారన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులకు మూసి ప్రక్షాళన ఇష్టం లేదన్నారు. సీఎం రేవంత్ నిర్ణయాలను సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదన్నారు. 

ఇది కూడా చదవండి: KTR Padayatra: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన!

బీజేఎల్పీ నేతగా ఎన్నికైన నాటి నుంచి అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు మహేశ్వర్ రెడ్డి. ఆర్ ట్యాక్స్ అని బీ ట్యాక్స్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టార్గెట్ గా ఆయన చేసిన విమర్శలు గతంలో సంచలనంగా మారాయి. తాజాగా తెలంగాణకు కొత్త సీఎం అంటూ తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు సైతం హాట్ టాపిక్ గా మారాయి. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు