/rtv/media/media_files/2025/10/05/telangana-bjp-2025-10-05-14-04-11.jpg)
తెలంగాణ బీజేపీలో మరో సారి విభేదాలు భగ్గుమన్నాయి. ఈ రోజు జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతలు నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో తీవ్ర సమన్వయ లోపం ఉందని పలువురు మండిపడ్డారు. ముఖ్యంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల తీరు సరిగా లేదని ఎంపీ కొండా మండిపడ్డారు. సరైన కో ఆర్డినేషన్ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల వేళ ఇది కరెక్ట్ కాదని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని సమస్య ఎందుకు వస్తుంది? అని ఎమ్మెల్యే కాటిపల్లి ఫైర్ అయ్యారు.
బీజేపీ నాయకుల సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.
— Telangana365 (@Telangana365) October 5, 2025
జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాటిపల్లి
ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య సమన్వయ లోపం ఉంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్ర పార్టీ… pic.twitter.com/oDOHZeMpug
పార్టీ ఆఫీసుల్లో కూర్చొని కార్యక్రమాన్ని ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నించారు. ఇలా డిసైడ్ చేసిన కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో అసలు ఉండనే ఉండవని మండిపడ్డారు. జిల్లాల్లో పార్టీ నేతల తీరు కూడా సరిగా లేదన్నారు. గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశాలకు రావడం, వెళ్లడమే మా పనా? అని నాయకత్వాన్ని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఎందుకు పార్టీ కార్యక్రమాలు లేవని ఫైర్ అయ్యారు. ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సరైన సమన్వయం లేదని మరో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నేతలకే ఇన్ ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని ఎంపీ డీకే అరుణ సూచించారు.
సమష్టిగా ముందుకెళ్దాం: బీజేపీ చీఫ్
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ.. సమస్యలు అన్నింటినీ సరి చేసుకొని సమష్టిగా ముందుకు వెళ్దామని సూచించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ఇష్యూ పై కమిటీ వేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్ధం అవుతోంది. ఈక్రమంలో ఈ నెల 8న పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, కీలక నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 15 జడ్పీటీసీలు గెలవడమే తమ లక్ష్యమని బీజేపీ చెబుతోంది. ఇందుకోసం జిల్లా అధ్యక్షుడు, ఇన్‌ఛార్జి, అబ్జర్వర్ తో త్రిసభ్య కమిటీ వేయనుంది. అనంతరం జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రాంచందర్ రావు ముందు రెండు ప్రధాన్ ఛాలెంజ్ లు ఉన్నాయి. అందులో ఒకటి స్థానిక ఎన్నికలు కాగా.. రెండవది జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు. ఈ రెండు ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్ష అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రతికూల ఫలితాలు వచ్చినా ఆయన నాయకత్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది.