పార్టీ మార్పు వార్తలపై బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా తప్పుగా వార్తలు ప్రసారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. పార్టీ మారుతున్నానంటూ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మాటలు మార్చి, పార్టీలు మారే వ్యక్తిని తాను కాదన్నారు. పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదన్నారు. పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలన్నారు ఈటల. బీఆర్ఎస్ నుంచి తనను బయటకు పంపించారన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు నన్ను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని అన్నారు. పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదన్నారు. వ్యక్తిత్వ హననం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 16న తెలంగాణకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంపీ ఈటలతో పాటు ఆయన అనుచరుడైన కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్ కూడా వచ్చారు. అతనికి కూడా కేంద్ర మంత్రికి స్వాగతం పలికేందుకు అవకాశం కల్పిచాలని, పాస్ ఇవ్వాలని ఈటల కోరారు. కానీ పార్టీ ముఖ్య నేతలు ఈ విషయాన్ని పట్టించుకోకుండా పాస్ ఇవ్వలేదు. దీంతో అలిగిన ఈటల అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరేడ్ గ్రౌండ్ లో జరగబోతున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరైన రాజ్ నాథ్ సింగ్ స్వాగతం పలికేందుకు కంటోన్మెంట్ బోర్డు మెంబర్ కు కూడా పాస్ ఇవ్వకుంటే ఎలా? అని పార్టీ నేతలను నిలదీశారు. దీంతో బీజేపీ నేతలు ఈటలను కన్విన్స్ చేసి లైన్ అప్ పాస్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఆత్మగౌరవం కోల్పోయాక ఎంత పదవి వచ్చినా అది గడ్డిపోచతో సమానమని నిన్న సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఈటల. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలెక్క విసిరిపడేశామని గుర్తు చేశారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాప్రాలో నిన్న జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకపోవడం, బండి సంజయ్ తో విభేదాల నేపథ్యంలో ఈటల చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన పార్టీ మారే ఛాన్స్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారేది లేదని ఆయన తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తమ నేతపై బీజేపీలోని ఓ వర్గం కుట్ర చేస్తోందని ఈటల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
BIG BREAKING: పార్టీ మార్పుపై ఈటల సంచలన వ్యాఖ్యలు!
పార్టీ మార్పు వార్తలపై బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా తప్పుగా వార్తలు ప్రసారం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. పార్టీ మారుతున్నానంటూ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.