/rtv/media/media_files/2025/09/09/eatela-rajender-vs-bandi-sanjay-2025-09-09-12-18-31.jpg)
/rtv/media/media_files/2025/09/09/eatela-vs-bandi-2025-09-09-12-19-18.jpg)
చాలా రోజులుగా ఉప్పు-నిప్పు మాదిరిగా ఉంటున్న తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండిసంజయ్ ఈ రోజు ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఏర్పాటు చేసిన అల్పాహార విందులో వీరిద్దరు పాల్గొన్నారు.
/rtv/media/media_files/2025/09/09/eatela-vs-bandi-1-2025-09-09-12-19-18.jpg)
రాష్ట్రానికి చెందిన ఇతర ఎంపీలు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందర్ రావు, డీకే అరుణ, గోడెం నగేష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఒకే టేబుల్ వద్ద వీరు కూర్చున్నారు. ఈ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/09/09/eatela-vs-bandi-2-2025-09-09-12-19-18.jpg)
బండి సంజయ్, ఈటల మధ్య కిషన్ రెడ్డి కూర్చున్నారు. అయితే.. బండి సంజయ్, ఈటల ఎదురెదురుగా ఉన్నారు. ఈ క్రమంలో ఈటల బండి సంజయ్ వైపు కాకుండా ఓ వైపు తిరిగి కూర్చున్నారు. దీంతో వీరి మధ్య వివాదం ఇంకా చల్లారలేదన్న చర్చ సాగుతోంది.
/rtv/media/media_files/2025/09/09/eatela-vs-bandi-3-2025-09-09-12-19-18.jpg)
గతంలో హుజూరాబాద్ లో తనకు ఎంపీ ఓట్లు తగ్గాయంటూ ఈటల టార్గెట్ గా బండి సంజయ్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. శత్రువుతో కొట్లాడొచ్చు కానీ.. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే వారితో కొట్లాడలేమంటూ ఈటల కౌంటర్ ఇచ్చారు.
/rtv/media/media_files/2025/09/09/eatela-vs-bandi-4-2025-09-09-12-19-18.jpg)
బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి దించేయడంలో ఈటల కీలక పాత్ర పోషించరాన్న చర్చ ఉండగా.. ఈ సారి ఈటలకు ఛాన్స్ రాకుండా బండి చక్రం తిప్పి పగ తీర్చుకున్నారన్న టాక్ ఉంది.
/rtv/media/media_files/2025/09/09/eatela-vs-bandi-5-2025-09-09-12-19-18.jpg)
ఈ కారణంగానే వీరిద్దరు బద్ధ శత్రువులుగా మారిపోయారన్నది బహిరంగ రహస్యమేనని తెలంగాణ పాలిటిక్స్ లో చర్చ ఉంది.
/rtv/media/media_files/2025/09/09/eatela-vs-bandi-6-2025-09-09-12-19-18.jpg)
దీంతో వీరిద్దరు ఒకే టేబుల్ వద్ద కూర్చున్న తాజా ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
/rtv/media/media_files/2025/09/09/eatela-vs-bandi-7-2025-09-09-12-19-18.jpg)