BIG BREAKING: ఇదేం పార్టీ.. బీజేపీ నేతలపై అలిగి వెళ్లిపోయిన ఈటల-VIDEO

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పార్టీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలికేందుకు తాను సూచించిన వ్యక్తికి పాస్ ఇవ్వకపోవడంతో ఆయన అలిగినట్లు తెలుస్తోంది.

New Update
Eatela Rajender BJP

బీజేపీ (BJP) సీనియర్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) బీజేపీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలికేందుకు బీజేపీ ముఖ్య నేతలు బేగంపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ కంటోన్మెంట్ మెంబర్ అయిన తన అనుచరుడికి పాస్ ఇవ్వాలని ఈటల కోరారు.

కానీ ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈటల సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా నేతకు కూడా పాస్ ఇవ్వకుంటే ఎలా అని పార్టీ నేతలను ఈటల నిలదీసినట్టు సమాచారం. ఓ దశలో ఇదేం పార్టీ అంటూ.. ఈటల అలిగి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే.. వెంటనే అలర్ట్ అయిన బీజేపీ ముఖ్య నేతలు ఈటలతో మాట్లాడి కన్విన్స్ చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈటల సూచించిన వ్యక్తికి పాస్ ఇవ్వడంతో వివాదానికి పుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది.  

ఇదిలా ఉంటే.. ఈటల రాజేందర్ బీజేపీ తీరుపై చాలా రోజులుగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవిపై ఈటల చాలా రోజులుగా ఆశలు పెట్టుకున్నారు. ఓ దశలో ఆయనకు పదవి ఖాయమన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో రాంచందర్ రావును అధ్యక్షుడిగా ఖరారు చేసింది హైకమాండ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెరవెనుక చక్రం తిప్పడంతోనే ఈటలకు పదవి మిస్ అయ్యిందన్న చర్చ జోరుగా సాగింది. ఆ తర్వాత ఈటల, బండి సంజయ్ మధ్య మాటల తూటాలు కూడా పేలాయి.

హుజూరాబాద్ లో తనకు ఓట్లు తక్కువ వచ్చాయని బండి సంజయ్ అంటే.. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు ఈటల. ఇటీవల ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏ ఎంపీలకు ఇచ్చిన అల్పాహార విందులో సైతం ఈటల రాజేందర్, బండి సంజయ్ ఒకే టేబుల్ వద్ద కూర్చున్నా.. ఎడ మొహం పెడ మొహంగానే ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు