తెలంగాణ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. పేపర్లు, హెడ్ ఫోన్లను విసిరికొడుతూ..!

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు పేపర్లు, హెడ్ ఫోన్స్ తో కొట్టుకున్నారు. ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహంతో స్పీకర్ పోడియం మెట్లు ఎక్కి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.

New Update

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వివాదం రచ్చ రచ్చగా మారింది. స్పీకర్ పోడియం వైపు కోరుట్ల ఎమ్మెల్యే పేపర్లు విసిరేశారు. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సైతం పేపర్ బంచ్ ను విసిరేయడంతో వివాదం పెద్దదైంది. ఎమ్మెల్యే హరీశ్ రావు స్పీకర్ మెట్లు ఎక్కే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపు దూసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెడ్ ఫోన్ ను విసిరేసే ప్రయత్నం చేశారు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేశారు. 
ఇది కూడా చదవండి: తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. మరికొద్ది సేపట్లో కేటీఆర్ అరెస్ట్?

ఫార్ములా-ఈ అంశంపై చర్చకు డిమాండ్..

అసెంబ్లీలో ఫార్ములా - ఈ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. 420 కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులు... ఫార్ములా-ఈ పై కేసు అక్రమమని ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టి.. నినాదాలు చేశారు.
ఇది కూడా చదవండి:
అసలు ఫార్ములా-ఈ రేసు కేసు ఏంటి? KTR చేసిన మిస్టేక్ అదేనా?

ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్..

ఇదిలా ఉంటే.. ఏ క్షణమైనా కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అయిన తెలంగాణ భవన్ కు భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు సైతం భారీగా మోహరిస్తుండడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు