Telangana: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తంచిన టీచర్‌కి దేహశుద్ధి

మంచిర్యాలలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు సత్యనారాయణ చెప్పులతో కొట్టి దేహశుద్ది చేశారు. తరగతి గదిలో విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తించి, మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
manchiryala

Manchiryala

TG news: మంచిర్యాల జిల్లాలో మరో ఉపాధ్యాయుడు భాగోతం బయట పడింది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో జరిగింది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సత్యనారాయణకు పాఠశాలకు వచ్చిన విద్యార్థినుల తల్లిదండ్రులు మార్కెట్ ఏరియాలో చెప్పులతో కొట్టారు. దీంతో టీచర్ గోడ దూకి పారిపోయాడు. ఆగ్రహం ఉన్న తల్లిదండ్రులు  సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మానసిక ఇబ్బందులకు గురిచేస్తూ..

కీచక గురువుకు చెప్పులతో కొట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో బాలికల పాఠశాలలో సంచలనం సృష్టించింది. బాలికల పాఠశాలలో తెలుగు బోధిస్తున్నాడు ఉపాధ్యాయుడు సత్యనారాయణ. తరగతి గదిలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూనే మానసిక ఇబ్బందులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఈ విషయాన్ని కొందరు విద్యార్థినులు ముందుగా ఉపాధ్యాయులకు చెప్పారు. వారు ఏ విధంగా  స్పందించలేదు.  దీంతో ఆయన అడగడంతో ఉపాధ్యాయుడు మితిమీరి విద్యార్థినుల పట్ల ఇంకా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

Also Read:శీతాకాలంలో ఈ సమయంలోనే విటమిన్ డి లభిస్తుంది

అంతేకాకుండా మద్యం సేవించి పాఠశాలకు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.  సత్యనారాయణ మాటలు భరించలేదని విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. ఆగ్రహించిన పలువురు తల్లులు పాఠశాలకు వచ్చి టీచర్‌ని నిలదీశారు. గోడ దూకి పారిపోబోయిన ఉపాధ్యాయుడిని పాఠశాల బయట పట్టుకొని చెప్పులతో కొట్టి గట్టిగా సన్మానించారు. రోడ్డుపైనే చితక బాదుతున్న మహిళలు నుంచి తన తప్పుపై క్షమించమని వేడుకున్నాడు. కోపంతో ఉన్న మహిళలు చెప్పులతో ఉపాధ్యాయుడిని చితక బాదారు. డీఈవోకి ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత  సస్పెండ్‌ చేస్తామని డీఈవో తెలిపారు.

Also Read:ఆజన్మ బ్రహ్మచారిని స్త్రీరూపంలో కొలిచే ఏకైక ఆలయం

Also Read: కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తారా.. కేటీఆర్ 

Also Read:  తెలంగాణలో మరో పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన

Advertisment
తాజా కథనాలు