Hanuman: ఆజన్మ బ్రహ్మచారిని స్త్రీరూపంలో కొలిచే ఏకైక ఆలయం ఛత్తీస్‌గఢ్‌లో ఆంజనేయస్వామిని స్త్రీ రూపంలో పూజిస్తారు. రతన్‌పూర్‌లో గిర్జాబంధ్‌లో దేవి హనుమంతుని విగ్రహం ఉంది. ఈ ప్రత్యేకమైన ఆలయం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ కథ తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 03 Dec 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update hanuman షేర్ చేయండి Female Hanuman Temple: భారతదేశంలో అనేక ప్రసిద్ధ హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. కానీ ఓ ఆలయానికి ప్రత్యేకత ఉంది. హనుమంతుడు బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని ఈ ఆలయంలో ఆంజనేయస్వామిని స్త్రీ రూపంలో పూజిస్తారు. ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రతన్‌పూర్‌లో ఉంది. ఈ ప్రత్యేకమైన ఆలయం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. హనుమంతుడు స్త్రీ రూపంలో పూజించబడే ప్రపంచంలోని ఏకైక ఆలయం కూడా ఇదే. రతన్‌పూర్‌లోని గిర్జాబంధ్‌లో ఉన్న ఈ ఆలయంలో దేవి హనుమంతుని విగ్రహం ఉంది. ఈ దేవాలయంపై ప్రజలకు అపారమైన విశ్వాసం. ఇక్కడ పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. గిర్జాబంధ్‌లోని హనుమాన్ ఆలయం శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉంది. ఈ హనుమంతుని విగ్రహం పదివేల సంవత్సరాల నాటిదని చెబుతున్నారు. హనుమాన్ రాజు కలలో కనిపించి.. ఈ ఆలయాన్ని పృథ్వీ దేవ్జూ అనే రాజు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. రాజు పృథ్వీ దేవ్జూ హనుమాన్‌కి గొప్ప భక్తుడు. రతన్‌పూర్‌ను చాలా సంవత్సరాలు పాలించాడు. అతను కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఒక రాత్రి హనుమంతుడు రాజు కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడని చెబుతారు. దీంతో రాజు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆలయ పనులు పూర్తవుతున్న సమయంలో హనుమాన్ మళ్లీ రాజు కలలో కనిపించి మహామాయ కుండ్ నుంచి విగ్రహాన్ని బయటకు తీసి ఆలయంలో ప్రతిష్టించమని కోరాడని అంటున్నారు. హనుమంతుడు చెప్పిన విధంగానే రాజు చెరువు నుండి విగ్రహాన్ని బయటకు తీశారు. అయితే స్త్రీ రూపంలో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. తర్వాత మహామాయ కుండ్ నుంచి బయటకు వచ్చిన విగ్రహాన్ని పూర్తి పూజలతో ఆలయంలో ప్రతిష్ఠించారు. Also Read: ఏపీలో విషాదం.. ప్రేమికులు ఆత్మహత్య విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత రాజుగారి అనారోగ్యం పూర్తిగా నయమైందని పురాణాలు చెబుతున్నాయి. రతన్‌పూర్‌లో చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చలికాలంలో ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది. అక్టోబర్, మార్చి మధ్య ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయంగా చెబుతారు. ఇలాంటి వింత ప్రదేశాలు మరెన్నో చూడాలంటే ఒక్కసారి చత్తీస్‌గఢ్‌కి వెళ్లాల్సిందే. సులభంగా రతన్‌పూర్ చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయం ఇక్కడికి సమీప విమానాశ్రయం. ఇక్కడ నుండి బిలాస్‌పూర్‌కి నేరుగా టాక్సీ, బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి క్యాబ్‌లో రతన్‌పూర్ చేరుకోవచ్చు. విమానాశ్రయం నుంచి రతన్‌పూర్ చేరుకోవడానికి దాదాపు ఐదు గంటల సమయం పడుతుంది. బిలాస్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. ఇది రతన్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్టేషన్ బయటి నుంచి గమ్యస్థానానికి క్యాబ్‌లు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. Also Read: హైదరాబాద్‌లో విషాదం.. నారాయణ కాలేజీలో మరో విద్యార్థి మృతి #hanuman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి