/rtv/media/media_files/2025/01/30/VvE4jnlEkxf3feD9bEIo.jpg)
Husband Killed Wife
Husband Killed Wife : ఆయనకు తన భార్యపై అనుమానం..తనను కాదని మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానం. ఇటీవల ప్రియుడితో కలిసి భర్తలను హత్యచేస్తున్న భార్యల గురించి విన్నాడు. తనను కూడా భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేస్తుందనే భయం పట్టుకుంది. అందుకే తన భార్యనే హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో వెలుగుచూసింది.
Also Read: ప్లే స్టోర్ లో డీప్ సీక్ దూకుడు..కానీ ఆ ప్రశ్నలకు మాత్రం!
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోర్గాం గ్రామానికి చెందిన నీరడి పోతన్న, నీరడి స్వప్న భార్యాభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే పోతన్నకు ఈమధ్య స్వప్నపై అనుమానం మొదలైంది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఈ క్రమంలో ఆ ప్రియుడితో కలిసి తనను చంపుతుందేమోనని భయం పెంచుకున్నాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కోపంతో పొలం వద్ద భార్యను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశాడు. అదే రాత్రి భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వెతుకుతామని హామీ ఇచ్చారు.
Also Read: GHMC MEETING : నేడు జీహెచ్ఎంసీ సమావేశం... టెన్షన్..టెన్షన్...
కానీ భయంతో తిరిగి మరునాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్యను చంపినట్లు అంగీకరించాడు. అంతేకాదు భార్యను చెరువులో పడేసిన విషయాన్ని కూడా వెల్లడించాడు. పోలీసులు గ్రామానికి చేరుకుని జాలర్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ సీఐ విజయ్ తెలిపారు.కేవలం అనుమానంతో భార్యపై దాడి చేసి హతమార్చడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.
Also Read: Local Bodie Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..