/rtv/media/media_files/2025/07/31/brs-mlas-2025-07-31-11-08-22.jpeg)
Supreme Court gives big shock to Speaker
BRS MLAs Disqualification Case : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వివాదం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం కేసు విచారణ చేపట్టింది. తెలంగాణ స్పీకర్‌పై బీఆర్ఎస్ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై. సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా ? అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టుధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోర్టుధిక్కారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్. గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. “మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమే.. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి..” అని జస్టిస్ బీఆర్ గవాయి స్పష్టం చేశారు. వారం రోజుల లొగా నిర్ఱయం తీసుకోవాలని ఆదేశించింది. లేదంటే నూతన సంవత్సర వేడుకలను జైలులో జరుపుకుంటారో నిర్ణయించుకోవాలని కోర్టు తేల్చి చెప్పింది. త్వరలోనే విచారణ పూర్తి చేస్తామని స్పీకర్ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి వెల్లడించారు.
Follow Us