BIG BREAKING: మేడారంలో అదుపుతప్పిన పరిస్థితి.. లాఠీ ఛార్జ్ లో భక్తులకు గాయాలు.. హై టెన్షన్!

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గురువారం అర్థరాత్రి ఒక్కసారిగా క్యూలైన్లు అదుపుతప్పాయి.  భక్తుల రద్దీతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. దర్శన క్యూ లైన్లలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో పలువురు మహిళలు, వృద్ధులు కిందపడిపోయారు.

New Update
FotoJet (85)

Breaking : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గురువారం అర్థరాత్రి ఒక్కసారిగా క్యూలైన్లు అదుపుతప్పాయి.  భక్తుల రద్దీతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దర్శన క్యూ లైన్లలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో పలువురు మహిళలు, వృద్ధులు కిందపడిపోయారు. పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలకు గాయలయ్యాయి. అనేకమంది తలలు పగిలిపోయాయి. అనేక మందికి తీవ్రగాయలయ్యాయి. భారీగా తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోవడంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితి జరిగింది. వీఐపీ. సాధారణ క్యూ లైన్ లోనే కాకుండా ఎగ్జిట్ పాయింట్లలో భక్తుల రద్దీ పెరిగింది.

వీవీఐపీ పాసులు ఉన్నవాళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణ భక్తులు కూడా వీవీఐపీ లైన్లలోకి రావడంతో  అక్కడ కూడా పోలీసులు చేతులెత్తేశారు.  ఒక దశలో భక్తులను అదుపు చేయలేక పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

సమ్మక్క గద్దె మీదికి వచ్చిన తరువాత పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో భక్తులను అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఈ సందర్భంగా  సీఎం రేవంత్ రెడ్డి సీతక్కలపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  జాతర పోలీసులకు వివిఐపీలకు నాయకులకా లేకపోతే భక్తులకా అంటూ సామన్యభక్తులు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ఒఒక దశలో అక్కడే ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాన్వయ్ పై దాడికి ప్రయత్నించారు. దీంతొ పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు కావడం తో పలు కుటుంబాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయి.  ఇన్నేళ్లలో  ఇట్లాంటి జాతరను మేము ఎప్పుడూ చూడలేదు అంటూ భక్తుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు